MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ

సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ

Rohit Sharma-Sachin Tendulkar: శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. వ‌రుస రెండో హాఫ్ సెంచ‌రీ కొట్ట‌డంతో పాటు భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2024, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma-Sachin Tendulkar: భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ లో వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. శ్రీలంక బౌలింగ్ ను చిత్తుచేస్తూ గ్రౌండ్ లో అన్ని వైపుల‌కు త‌దైన బౌండ‌రీ షాట్ల‌ను బాదాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం (ఆగస్టు 4) శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ లో రోహిత్ 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 3 వన్డేల సిరీస్‌లో అతనికిది వరుసగా రెండో అర్ధశతకం. తొలి మ్యాచ్‌లో హిట్‌మన్ 58 పరుగులు ఇన్నింగ్స్ ఆడిన సంగ‌తి తెలిసిందే. 

36

శ్రీలంక బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుప‌డుతూ త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. హిట్‌మ్యాన్ 145.45 స్ట్రైక్ రేట్ త‌న ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ క్ర‌మంలోనే తన పేరిట ఓ పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు. భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 

46
sachin rohit

sachin rohit

రోహిత్ శర్మ అర్ధశతకం సాధించి ఓపెనర్‌గా, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వ‌న్డే, టీ20 క్రికెట్) అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలోనే స‌చిన్ రికార్డును బ్రేక్ చేశాడు. టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 120 సార్లు ఓపెనర్‌గా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. రోహిత్ 121వ సార్లు ఓపెన‌ర్ గా 50 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు. భారత క్రికెట్ లో ఒపెనర్ గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ. 

56
sachin rohit shots

sachin rohit shots

నాలుగోసారి వన్డే క్రికెట్‌లో రోహిత్ 10 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుకు చేరువ‌య్యాడు. సెహ్వాగ్ వన్డేల్లో 7 సార్లు 10 ఓవర్లలోనే ఫిఫ్టీ సాధించాడు. సచిన్ టెండూల్కర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కోసారి హాఫ్ సెంచ‌రీ కొట్టారు. 

66
sachin tendulkar rohit sharma

sachin tendulkar rohit sharma

వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ 300 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఓపెనర్‌గా నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు, భారత్ తరఫున వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లేడు. రోహిత్ తన కెరీర్‌లో 175 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును నెలకొల్పాడు.

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved