IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్.. భారత దిగ్గజాల రికార్డులు బ్రేక్ !
Ravichandran Ashwin: భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ భగవత్ చంద్రశేఖర్ రికార్డును బ్రేక్ చేశాడు.
IND vs ENG - Ravichandran Ashwin: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత సినీయర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటివరకు 3 వికెట్లు తీసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ పై టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డును తన పేరును లిఖించుకున్నాడు. లెజెండరీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్‌ను అధిగమించాడు.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న భారత్ రెండో టెస్టులో 4వ రోజు రవి చంద్రన్ అశ్విన్ ఈ రికార్డు సృష్టించాడు.
Ravichandran Ashwin
టెస్టు మ్యాచ్‌కు ముందు అశ్విన్ రికార్డును బద్దలు కొట్టేందుకు 2 వికెట్ల దూరంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్కవికెట్ తీయకపోయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు.
മറ്റുള്ളവര്
వైజాగ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి షార్ట్ లెగ్ వద్ద క్యాచ్ పట్టిన బెన్ డకెట్ వికెట్‌తో అశ్విన్ ఖాతా తెరిచాడు. 4వ రోజు తొలి సెషన్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 196 పరుగుల అద్భుత నాక్‌తో భారత్‌కు చెమటలు పట్టించిన ఓలీ పోప్ వికెట్ ను అశ్విన్ పడగొట్టాడు.
Ravichandran Ashwin
ఆఫ్-స్టంప్ వెలుపల అశ్విన్ బౌలింగ్ చేయగా, పోప్ ఆఫ్-సైడ్ ద్వారా కష్టమైన కట్ షార్ట్ ఆడటం కోసం ట్రై చేశాడు. బ్యాట్ ఎడ్జ్ కు తాకడంలో రోహిత్ శర్మ స్లిప్ అద్భుతమైన క్యాచ్ ను అందుకోవడంతో వికెట్ పడింది.
Ravichandran Ashwin, Ashwin
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్ లో ఇప్పటివరకు 97 మ్యాచ్ లను ఆడి 2.78 ఎకానమీ రేటుతో 499 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 34 సార్లు 5 వికెట్లు తీసుకోగా, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.
Ravichandran Ashwin
అశ్విన్ భారత జట్టులో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తూ కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. 2021లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కూడా సాధించాడు.