Ranji Trophy: అయ్యో విరాట్ కోహ్లీ.. ఇలా జరిగిందేంటి !
Ranji Trophy: బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మళ్లీ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లీ మళ్లీ క్రికెట్ లవర్స్ ను నిరాశపరిచాడు.

Ranji Trophy: రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్లతో కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. భారత ప్రీమియర్ డొమెస్టిక్ టోర్నమెంట్‌ని ఆడేందుకు స్టార్ బ్యాటర్ పునరాగమనం చేయడం దేశీయ మ్యాచ్‌లు వేడకగా మారాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఢిల్లీ జెర్సీని ధరించిన గ్రౌండ్ లోకి దిగడం చూడాలని వేల మంది అభిమానులు తెల్లవారుజామున 3 గంటల నుంచే స్టేడియం వెలుపల సందడి చేశారు.
జనవరి 31, శుక్రవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో జరిగిన ఢిల్లీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ ను క్రికెట్ లవర్స్ ఆశించారు. అయితే, ఈ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీ ఎంట్రీ గొప్పగా జరగలేదు. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరి క్రికెట్ లవర్స్ ను నిరాశపరిచాడు.
రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 1వ రోజు తన ఢిల్లీ సహచరులతో కలిసి మైదానంలోకి దిగిన తర్వాత అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం కోహ్లీ కోహ్లీ అంటూ మారుమోగింది. 2012 తర్వాత విరాట్ కోహ్లీ ఇప్పుడు రంజీలో ఆడుతున్నాడు.
2వ రోజు యష్ అవుట్ అయిన తర్వాత, కోహ్లి బ్యాటింగ్‌కు బయటకు వచ్చిన వెంటనే గ్రౌండ్ హోరెత్తింది. అభిమానులు కోహ్లీ నినాదంగా బ్రహ్మరథం పట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక అందరి దృష్టి కోహ్లిపై పడింది. అతను ఐదో బంతికి షార్ట్ కవర్‌ను సున్నితంగా కొట్టి తన ఖాతా తెరిచాడు. అయితే కోహ్లీ ఒక్క క్షణం కూడా క్రీజులో కుదురుకున్నట్టుగా కనిపించలేదు. సాంగ్వాన్‌కి వికెట్ లభించి ఉండవచ్చు కానీ కునాల్ యాదవ్ కదలిక, బౌన్స్‌తో కోహ్లీని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు.
Virat Kohli
ఢిల్లీ ఇన్నింగ్స్ 27వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ ఔట్ ఎడ్జ్ ను యాదవ్ రెండుసార్లు కొట్టాడు. ఇది ఆరో స్టంప్ లైన్ కావడం కోహ్లి బలహీనత. రైల్వే సీమర్ మళ్లీ కోహ్లీని టార్గెట్ చేశాడు. తర్వాతి బంతికి ఐదో స్టంప్ లైన్ చుట్టూ బంతి పిచ్ కావడంతో మళ్లీ కోహ్లి దెబ్బ తిన్నాడు. తర్వాత ఓవర్‌లో సాంగ్వాన్ కోహ్లీ స్టంప్స్‌పై దాడి చేశాడు.
కోహ్లీ 6 పరుగులకే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లి తన రంజీ ట్రోఫీ రిటర్న్ మొదటి ఇన్నింగ్స్‌లో చౌకగా ఔట్ అయిన వెంటనే, అభిమానులు తమ అభిమాన బ్యాటర్ తొందరగా ఔట్ కావడం చూసి నిరాశ చెందడంతో అరుణ్ జైట్లీ స్టేడియం నుండి బయలుదేరడం ప్రారంభించారు. కోహ్లి బ్యాటింగ్‌కు చేస్తున్న సమయంలో హోరెత్తిన గ్రౌండ్ ఊహించని అవుట్‌తో ఒక్కసారిగా సైలెంట్ అయింది.
Image Credit: Twitter
విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ను చూసేందుకు గంటల తరబడి నిరీక్షించిన చాలా మంది అభిమానులు, అతను ఔటైన వెంటనే స్టేడియం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, BCCI సెలెక్టర్లు, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సూచనల మేరకు విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. ఆసీస్ తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అక్కడ ఒక సెంచరీతో సహా కేవలం 190 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సగటు 23.75.