MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Operation Sindoor: ఉగ్రవాదం ఆగేదాకా భారత్–పాకిస్థాన్ క్రికెట్‌కు బ్రేక్ వేయాలి: గౌతమ్ గంభీర్

Operation Sindoor: ఉగ్రవాదం ఆగేదాకా భారత్–పాకిస్థాన్ క్రికెట్‌కు బ్రేక్ వేయాలి: గౌతమ్ గంభీర్

Operation Sindoor: ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తో  ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్ ఆడొద్దని గంభీర్ సూచించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

2 Min read
Author : Galam Venkata Rao
Published : May 07 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gautam Gambhir

Gautam Gambhir

ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏ ICC టోర్నీ అయినా సరే, భారత్ పాక్ మ్యాచ్‌లు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.

"నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఉగ్రవాదం ఆగేంతవరకూ భారత్–పాకిస్థాన్ మధ్య ఏ మ్యాచ్‌ కూడా ఉండకూడదు. ఈ విషయం మీద నేను గతంలోనూ చెప్పాను," అని గంభీర్ అన్నారు.

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు, మరణించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇందస్ వాటర్ ట్రిటీని నిలిపివేసింది, అటారి సరిహద్దును మూసివేసింది. పాక్‌తో డిప్లమాటిక్ సంబంధాలను తగ్గించింది. 
 

24
Indian cricket team

Indian cricket team

ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గంభీర్ మాట్లాడుతూ, "భారత జవాన్లు, పౌరుల ప్రాణాలు సినిమా, సంగీతం, క్రికెట్ కంటే చాలా పెద్దవి. మ్యాచ్‌లు మళ్లీ జరుగుతాయి, సినిమాలు వస్తాయి. కానీ కుటుంబసభ్యుడిని కోల్పోయిన బాధ దేంతోనూ సరిపోలదు" అని వ్యాఖ్యానించారు.
 

Related Articles

Related image1
India Pakistan Tensions: సింధూ జలల చర్యలు యుద్ధంతో సమానం.. భారత్ పై పాక్ పార్లమెంట్ అక్కసు
Related image2
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో బాలీవుడ్ హీరోయిన్ల లవ్ ఎఫైర్లు
34
India vs Pakistan Cricket match

India vs Pakistan Cricket match

ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్ పాకిస్థాన్ ఆడాలా? లేదా వచ్చే ఏడాది ఇండియా-శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఈ జట్ల మధ్య మ్యాచ్ ఉండాలా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, గంభీర్ ఇలా చెప్పారు: "ఇది నా నిర్ణయం కాదు. BCCI, ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల నిర్ణయాన్ని మనం గౌరవించాలి. దీనిని రాజకీయంగా వాడుకోవద్దు." అని అన్నారు.
 

44
Pakistan Cricket Team

Pakistan Cricket Team

ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భద్రతా సమస్యల వల్ల భారత జట్టు పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లోనే అన్ని మ్యాచులు ఆడింది. BCCI, పాక్ క్రికెట్ బోర్డు, ICC మధ్య ఒప్పందం ప్రకారం 2027 వరకు జరిగే టోర్నీల్లో ఇండియా–పాక్ మ్యాచ్‌లు న్యూట్రల్ వేదికలపై మాత్రమే జరుగుతాయి.

గంభీర్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ రాజకీయాలపై చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
మైదానంలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. టీమిండియాపై పాక్ జట్టుదే పైచేయి
Recommended image2
సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే పాక్‌కు ఝలక్.! సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే
Recommended image3
India vs South Africa : ఓపెనర్లు ఫ్లాప్.. మిడిల్ ఆర్డర్ డీలా ! ముంచేశారు భయ్యా
Related Stories
Recommended image1
India Pakistan Tensions: సింధూ జలల చర్యలు యుద్ధంతో సమానం.. భారత్ పై పాక్ పార్లమెంట్ అక్కసు
Recommended image2
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో బాలీవుడ్ హీరోయిన్ల లవ్ ఎఫైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved