- Home
- Sports
- Cricket
- India: కోహ్లీ, సచిన్ లకు సాధ్యం కాలేదు.. లార్డ్స్‌లో మూడు టెస్ట్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత క్రికెటర్ ఎవరు?
India: కోహ్లీ, సచిన్ లకు సాధ్యం కాలేదు.. లార్డ్స్‌లో మూడు టెస్ట్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత క్రికెటర్ ఎవరు?
Team india: విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌కు సాధ్యం కాని రికార్డును ఒక భారత క్రికెటర్ సాధించాడు. లార్డ్స్ లో మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

లార్డ్స్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ సెంచరీ రికార్డులు
భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లు ఎన్నోమంది ఉన్నా, లార్డ్స్ మైదానంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఘనత మాత్రం ఒక్కరికి మాత్రమే దక్కింది. అయనే దిలీప్ వెంగ్‌సర్కార్. 1983 నుంచి 1987 వరకు తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను దిలీప్ వెంగ్‌సర్కార్ ఆశ్చర్యపరిచారు. ఆయన లార్డ్స్ మైదానంలో మూడు టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు.
దిలీప్ వెంగ్‌సర్కార్ కు లార్డ్స్ స్పెషల్
దిలీప్ వెంగ్‌సర్కార్ 1979లో లార్డ్స్‌లో 0, 103 పరుగులు చేశారు. 1982లో 2, 157 పరుగులు, 1986లో నాటౌట్‌గా 126, 33 పరుగులు చేశారు. ఈ మూడు టెస్ట్‌లలో మూడు సెంచరీలు సాధించిన దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్‌లో మూడు సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు మాత్రమే కాకుండా, తొలి నాన్-ఇంగ్లీష్ ప్లేయర్ కూడా. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజులెవరూ లార్డ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయారు.
దిలీప్ వెంగ్‌సర్కార్ - లార్డ్స్ రికార్డులు
దిలీప్ వెంగ్‌సర్కార్ లార్డ్స్‌లో నాలుగు టెస్ట్‌లు ఆడి మొత్తం 508 పరుగులు చేశారు. ఆయన సగటు 72.57. చివరిసారిగా దిలీప్ వెంగ్‌సర్కార్ లార్డ్స్‌లో 1990లో ఆడారు, కానీ అప్పుడు సెంచరీ సాధించలేకపోయారు. ఆ మ్యాచ్‌లో ఆయన 52, 35 పరుగులు చేశారు.
దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్సీ ప్రయాణం
1985–87 మధ్యకాలంలో దిలీప్ వెంగ్‌సర్కార్ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంకపై సెంచరీలు సాధించారు. 1987 వరల్డ్‌కప్ తర్వాత దిలీప్ వెంగ్‌సర్కార్ ను కెప్టెన్‌గా నియమించగా, ఆయన తొలి రెండు టెస్ట్‌లలో సెంచరీలు బాదారు. అయితే 1989 వెస్టిండీస్ టూర్ తర్వాత కెప్టెన్సీ కోల్పోయారు.
దిలీప్ వెంగ్‌సర్కార్ అంతర్జాతీయ కెరీర్
దిలీప్ వెంగ్‌సర్కార్ 1975–76లో న్యూజిలాండ్‌తో తన టెస్ట్ కెరీర్ ప్రారంభించారు. 116 టెస్ట్‌ల్లో 42.13 సగటుతో 6868 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దిలీప్ వెంగ్‌సర్కార్ వన్డేల్లో 129 మ్యాచ్‌లు ఆడి 34.73 సగటుతో 3508 పరుగులు చేశారు. వన్డేల్లో ఒక సెంచరీ సాధించారు. 1992లో ఆస్ట్రేలియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
దిలీప్ వెంగ్‌సర్కార్ ఎక్కడ జన్మించారు?
దిలీప్ వెంగ్‌సర్కార్ 1956 ఏప్రిల్ 6న మహారాష్ట్రలోని రాజాపూర్‌లో జన్మించారు. 1970ల చివరలో, 1980ల ప్రారంభంలో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించిన ప్రముఖ ఆటగాడు. లార్డ్స్‌లోని ఆయన రికార్డు ఇప్పటికీ చిరస్మరణీయం.