MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • బుమ్రా కాదు పాట్ కమ్మిన్స్ కాదు.. టీ20 ప్రపంచ కప్‌ డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరో తెలుసా?

బుమ్రా కాదు పాట్ కమ్మిన్స్ కాదు.. టీ20 ప్రపంచ కప్‌ డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరో తెలుసా?

most wickets : టీ20 ప్ర‌పంచ క‌ప్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన టీమిండియా ఫైన‌ల్ లో సౌతాఫ్రికాపై అద్భుత విజ‌యంతో ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ ప్ర‌పంచ క‌ప్ లో మ‌న బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. 
 

Mahesh Rajamoni | Published : Jul 03 2024, 11:29 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న టాప్-5 బౌల‌ర్ల‌ల‌లో ఫజల్హక్ ఫారూఖీ, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్ట్జే, ర‌షీద్ ఖాన్ లు ఉన్నారు. 

28
Asianet Image

అయితే, ఈ ప్ర‌పంచ క‌ప్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న వారిలో టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా లేడు.. ఆస్ట్రేలియా స్టార్ పాట్ క‌మ్మిన్స్ లేడు.. వీరిద్ద‌రిని దాటేసిన టీమిండియా యంగ్ బౌల‌ర్ అద్భుతంగా రాణించి డెత్ ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్నాడు. 

38
India , Cricket, Arshdeep Singh

India , Cricket, Arshdeep Singh

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు త‌న బౌలింగ్ తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 

48
Asianet Image

బార్బడోస్ లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో దక్షిణాఫ్రికాపై కూడా అర్ష్‌దీప్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. జట్టు గెలవడంలో అతని స‌పోర్టు కూడా కీల‌కంగా ఉంది. 

58
Asianet Image

టీప్ర‌పంచ క‌ప్ 2024 లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్ల జాబితాలో అర్ష్ దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. అత‌ను 8 మ్యాచ్ ల‌లో 17 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

68
Asianet Image

ఇక డెత్ ఓవ‌ర్ల‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్ గా కూడా అర్ష్ దీప్ సింగ్ ఘ‌న‌త సాధించాడు. పాట్ క‌మ్మిన్స్, జ‌స్ప్రీత్ బుమ్రాల‌ను అధిగ‌మించాడు. అర్ష్‌దీప్ 8.2 ఎకానమీతో డెత్ ఓవర్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. 

78
Asianet Image

ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్ కూడా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు, అయితే అతని ఎకానమీ రేటు 8.9గా ఉండ‌టంతో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. 

 

88
Asianet Image

డెత్ ఓవర్లలో ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ నిలిచాడు. క‌మ్మిన్స్ త‌ర్వాత భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, బుమ్రా ఎకానమీ 4.4గా ఉంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 
Recommended Stories
Top Stories