- Home
- Sports
- Cricket
- ఇప్పటికైతే బాగానే ఉంది కానీ ఇప్పట్లో నేను ఆడేది డౌటే.. షాకింగ్ కామెంట్స్ చేసిన కొత్త పెళ్లికొడుకు
ఇప్పటికైతే బాగానే ఉంది కానీ ఇప్పట్లో నేను ఆడేది డౌటే.. షాకింగ్ కామెంట్స్ చేసిన కొత్త పెళ్లికొడుకు
India Tour OF England: టీమిండియా యువ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే పెళ్లి చేసున్నాడు. అయితే రాబోయే ఇంగ్లాండ్ పర్యటన (టీ20లలో) లో అతడు తిరిగి జట్టుతో చేరతాడని అనుకుంటున్న తరుణంలో..

టీమిండియా నయా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ మరో బాంబు పేల్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా గాయపడ్డ అతడు ఇప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. గాయం కారణంగా అతడు ప్రతిష్టాత్మక ఐపీఎల్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్ జరుగుతుండగా బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిటేషన్ సెంటర్ లో ఉన్న చాహర్ కు వెన్ను నొప్పి వేధించిన విషయం తెలిసిందే.
వెన్ను నొప్పి గాయం కారణంగా ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్న అతడికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని.. ఆ తర్వాత కూడా అతడు ఫిట్నెస్ సాధించడం పైనే చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయని ఎన్సీఏ వైద్యులు తేల్చి చెప్పారు.
కాగా ఈ గ్యాప్ లో చాహర్ జూన్ 1న తన గర్ల్ ఫ్రెండ్ జయా భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. కాగా హనీమూన్ ఎంజాయ్ చేసి తిరిగి ఎన్సీఏలో చేరిన చాహర్.. ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ తర్వాత ఆడబోయే పరిమిత ఓవర్ల వరకైనా అందుబాటులో ఉంటాడని టీమిండియా ఫ్యాన్స్ భావించారు. కానీ వారి ఆశలపై చాహర్ నీళ్లు చల్లాడు.
తానింకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని.. ఇంగ్లాండ్ పర్యటనకు తాను అందుబాటులో ఉండేది అనుమానమే అని స్పష్టం చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘నేను నిలకడగా ఐదారు ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్నాను. నా రిహాబిటేషన్ ప్రోగ్రామ్ బాగా సాగుతున్నది. నేను బాగానే కోలుకుంటున్నా. ఇప్పటికైతే ఫిట్ గానే ఉన్నా..
Deepak Chahar
కానీ ఈ ఫిట్నెస్ తో ఇప్పటికిప్పుడు భారత జట్టుకు ఆడతానని నేను అనుకోవడం లేదు. నేను వంద శాతం ఫిట్నెస్ సాధించడానికి మరో నాలుగైదు వారాలు పట్టే అవకాశముంది.. ఇంగ్లాండ్ తో టీ20లకు నేను అందుబాటులో ఉండేది అనుమానమే..’ అని స్పష్టం చేశాడు. జులై 1-4 మధ్య ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్టు ఆడనుంది. ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడాల్సి ఉంది. అయితే వీటికి చాహర్ అందుబాటులో ఉండటం కష్టమే.
Deepak Chahar
అయితే ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో లేకున్నా చాహర్.. ఆగస్టులో జరగాల్సి ఉన్న ఆసియా కప్ కు గానీ.. అంతకుముందే జరుగనున్న వెస్టిండీస్ పర్యటనకు గానీ జట్టుతో చేరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.తాను ఫిట్నెస్ సాధించిన తర్వాత కాస్త క్లబ్ క్రికెట్ ఆడి ఆ తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగుతానని చాహర్ చెప్పాడు.