MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL: ముంబై ఇండియన్స్‌ ఓడిపోవచ్చు.. ఆ విషయంలో మాత్రం కోట్లాది హృదయాలను గెలుచుకుంది

IPL: ముంబై ఇండియన్స్‌ ఓడిపోవచ్చు.. ఆ విషయంలో మాత్రం కోట్లాది హృదయాలను గెలుచుకుంది

ఐపీఎల్‌ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్‌ ఆటలో ఓడినా ఓ విషయంలో మాత్రం అందరినీ హృదయాలను గెలుచుకుంది..  

2 Min read
Narender Vaitla
Published : Mar 24 2025, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit: ANI

Image Credit: ANI

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి చెందిన ముగ్గురు ప్లేయర్స్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి వేలంలో విగ్నేష్‌ పుతుర్‌, సత్యనారాయణ రాజు, రాబిన్‌ మింజ్‌ అనే ముగ్గురు ప్లేయర్స్‌ని ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తీసుకోవడమే కాదు తొలి మ్యాచ్‌లోనే వీరికి స్థానం కల్పించారు.

దీంతో యంగ్‌ ట్యాలెంట్‌ను ప్రమోట్‌ చేయడానికి ముంబై ఇండియన్స్‌ పెద్ద పీట వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఈ ముగ్గురు ప్లేయర్స్‌ కుటుంబ నేపథ్యంలో. పేద కుటుంబంలో జన్మించిన వీరు ఇప్పుడు ఐపీఎల్‌లో తళుక్కుమనే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్లేయర్స్‌ బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకుందాం.. 
 

24
Sathya narayana raju

Sathya narayana raju

సత్యనారాయణ రాజు మన తెలుగు కుర్రాడే..

సత్యనారాయణ రాజు కాకినాడకు చెందిన ప్లేయర్‌. రాజు తండ్రి రొయ్యల వ్యాపారి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజు ఐపీఎల్‌ ఆడే స్థాయికి చేరుకోవడం నిజంగానే గొప్ప విషయమని చెప్పాలి. సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్‌ రూ. 30 లక్షల బేస్‌ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. రాజు క్రికెట్ కెరీర్‌ విషయానికొస్తే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2024లో తన ఆటతీరుతో ప్రపంచానికి పరిచమయ్యాడు. ఈ రైట్ హాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ రాయలసీమ కింగ్స్ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 6.15 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. 
 

34
vignesh

vignesh

ఆటో డ్రైవర్‌ కొడుకు విగ్నేష్‌ పుతుర్‌: 

కేరళ రాష్ట్రానికి చెందిన విగ్నేష్‌ పుతుర్‌ తండ్రి ఒక ఆటో డ్రైవర్‌. పేద కుటుంబానికి చెందిన విగ్నేష్‌ తన అకుంఠిత దీక్షతో క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కేరళా క్రికెట్‌ లీగ్‌, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ వంటి వాటిలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో విగ్నేష్‌ను రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విగ్నేష్‌ను ఇటీవల సౌతాఫ్రికాకు పంపించి ప్రత్యేకంగా శిక్షణ అందించారు. 
 

44
Robin minj

Robin minj

రాబిన్‌ మింజ్‌: 

ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో వచ్చిన మరో యంగ్‌ ప్లేయర్‌ రాబిన్‌ మింజ్‌. జార్ఖండ్‌కు చెందిన గిరిజన ముద్దు బిడ్డ రాబిన్‌ మింజ్‌. ఐపీఎల్‌లో ఆడిన తొలి భారత గిరిజన క్రికెటర్‌గా రాబిన్‌ చరిత్ర సృష్టించాడు. నిజానికి రాబిన్‌ మింజ్‌ను 2024లో గుజరాత్‌ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే బైక్‌ యాక్సిడెంట్‌ కావడంతో గతేడాది సీజన్‌కు దూరమయ్యాడు. తాజాగా తిరిగి కోలుకున్న రాబిన్‌ను ముంబై ఇండియన్స్‌ ఏకంగా రూ. 65 లక్షలకు సొంతం చేసుకుంది. రాబిన్‌ పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈయన తండ్రి ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌. కొడుకు క్రికెటర్‌గా రాణిస్తున్న సమయంలోనూ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
హిట్‌మ్యానా.. మజాకానా.! ఒక దెబ్బకు రెండు పిట్టలు.. వన్డేల్లో ప్రపంచ రికార్డు
Recommended image2
టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !
Recommended image3
ఇదేం అరాచ‌కం సామీ.. 11 సిక్సులు, 7 ఫోర్లు, 32 బంతుల్లోనే సెంచ‌రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved