MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీ vs సచిన్: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై ఎవరు బెస్ట్?

కోహ్లీ vs సచిన్: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై ఎవరు బెస్ట్?

Kohli vs Tendulkar: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌.. ప్రపంచ క్రికెట్ లో లెజెండరీ ప్లేయర్లు. అయితే, టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల గణాంకాల పోలిక, వారి స్వదేశీ, విదేశీ రికార్డులను గమనిస్తే ఎవరు బెస్ట్? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2025, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Kohli vs Tendulkar: విరాట్ కోహ్లీ - సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున గొప్ప బ్యాటర్లు. ఇద్దరూ రెండు వేర్వేరు యుగాలలో ఆడారు. వారి అద్భుతమైన ఆటతో అదరగొట్టారు. 

కోహ్లీ-టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లపై అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై స్థిరంగా రాణించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇంగ్లాండ్‌పై స్వదేశంలో..

ఇంగ్లాండ్‌పై స్వదేశంలో..

విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై గొప్ప ఇన్నింగ్స్ లను ఆడాడు. 13 మ్యాచ్‌లలో 56.38 సగటుతో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1015 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్‌లతో పాటు ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన ముగ్గురు భారత బ్యాటర్లలో కోహ్లీ ఒకరు. 2016లో వాంఖడే స్టేడియంలో 340 బంతుల్లో 235 పరుగులు చేయడం కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన.

సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 48.00 సగటుతో 3 సెంచరీలు,  5 హాఫ్ సెంచరీలతో 960 పరుగులు సాధించాడు. చెన్నై టెస్టులో 296 బంతుల్లో 165 పరుగులు చేయడం టెండూల్కర్ అత్యుత్తమ ప్రదర్శన.

36
ఇంగ్లాండ్‌పై విదేశాల్లో..

ఇంగ్లాండ్‌పై విదేశాల్లో..

సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌లలో 54.31 సగటుతో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1575 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు సచిన్. 1993లో లీడ్స్ టెస్టులో 330 బంతుల్లో 193 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌లో 15 మ్యాచ్‌లలో 33.65 సగటుతో 2 సెంచరీలు, 5 అర్ధశతకాలతో 976 పరుగులు సాధించాడు. 2018లో బర్మింగ్‌హామ్ టెస్టులో 225 బంతుల్లో 149 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

46
ఆస్ట్రేలియాపై స్వదేశంలో..

ఆస్ట్రేలియాపై స్వదేశంలో..

సచిన్ టెండూల్కర్ స్వదేశంలో ఆస్ట్రేలియాపై 19 మ్యాచ్‌లలో 56.90 సగటుతో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1821 పరుగులు సాధించాడు. 2010లో బెంగళూరు టెస్టులో 363 బంతుల్లో 214 పరుగులు చేయడం టెండూల్కర్ అత్యుత్తమ ప్రదర్శన.

విరాట్ కోహ్లీ స్వదేశంలో ఆస్ట్రేలియాపై 11 మ్యాచ్‌లలో 39.18 సగటుతో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 627 పరుగులు సాధించాడు. 2023లో అహ్మదాబాద్ టెస్టులో 364 బంతుల్లో 186 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

56
ఆస్ట్రేలియాపై విదేశాల్లో..

ఆస్ట్రేలియాపై విదేశాల్లో..

సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాలో 20 మ్యాచ్‌లలో 53.20 సగటుతో 6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 1809 పరుగులు సాధించాడు. 2004లో సిడ్నీ టెస్టులో 436 బంతుల్లో 241 పరుగులు చేయడం టెండూల్కర్ అత్యుత్తమ ప్రదర్శన.

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో 18 మ్యాచ్‌లలో 46.72 సగటుతో 7 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1542 పరుగులు సాధించాడు. 2014లో మెల్‌బోర్న్ టెస్టులో 272 బంతుల్లో 169 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

66

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత బ్యాటింగ్ దిగ్గజాలే అయినప్పటికీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టెస్ట్ ప్రదర్శనలలో, ముఖ్యంగా విదేశీ పరిస్థితులలో టెండూల్కర్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ
భారత దేశం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Related Stories
Recommended image1
Trump: ఇండియా-పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ యూటర్న్?
Recommended image2
SRH IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved