చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా తన 31వ పుట్టినరోజును చిరస్మరణీయమైన వ్యక్తిగత మైలురాయితో రికార్డు సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ తో ఒక క్యాలెండర్ ఇయర్ లో 50 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.
Jasprit Bumrah: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా అడిలైడ్ ఒవల్ లో రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. అయితే, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ తక్కువ స్కోర్ కు పరిమితమైంది. 180 పరుగులు చేసింది.
Jasprit Bumrah
అయితే, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 2024 సీజన్‌లో 50 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అడిలైడ్‌లో జరుగుతున్న పింక్-బాల్ టెస్టు తొలిరోజు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (13)ను ఔట్ చేసిన తర్వాత భారత పేసర్ ఈ ఫీట్ సాధించాడు.
దీంతో భారత లెజెండరీ ప్లేయర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 31 ఏళ్ల బుమ్రా 2024లో 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 50+ వికెట్లు తీసుకున్నాడు. టీమిండియాకు అనేక మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనలను అందించాడు.
Jasprit Bumrah LBW Steve Smith
ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 టెస్టు వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా కపిల్ దేవ్ నిలిచాడు. భారత బౌలర్ 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 1983లో కూడా 18 టెస్టుల్లో 75 వికెట్లు పడగొట్టి ఇదే మైలురాయిని సాధించాడు. అతని తర్వాత స్వింగ్ బౌలింగ్ కింగ్ జహీర్ ఖాన్ 2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు ఇప్పుడు బుమ్రా వీరి ప్రత్యేక క్లబ్ లో చేరాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ రికార్డు విషయానికి వస్తే, ఇది 1981లో 13 టెస్టుల్లో 85 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడు డెన్నిస్ లిల్లీ పేరున ఉంది. ఓవరాల్‌గా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్. 2005లో 15 టెస్టుల్లో 96 వికెట్లు తీశాడు.
Jasprit Bumrah, Bumrah
బుమ్రా మెరిసినా ఇతర భారత పేసర్లు నిరాశపరిచారు. మరోసారి జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టు తొలి రోజు రాణించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసి ఈ కొత్త ఫీట్ సాధించాడు. అడిలైడ్‌లో జరుగుతున్న పింక్-బాల్ టెస్ట్ ప్రారంభ రోజున తన 11 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఇందులో నాలుగు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణాలు వికెట్ల కోసం ప్రయత్నం చేశారు.