- Home
- Sports
- Cricket
- Ishan Kishan : ఇదేం హిట్టింగ్ ఇషాన్ బ్రో... వరల్డ్ క్లాస్ బౌలర్లని కుక్కల్ని కొట్టినట్లు కొడతావేంటి!!
Ishan Kishan : ఇదేం హిట్టింగ్ ఇషాన్ బ్రో... వరల్డ్ క్లాస్ బౌలర్లని కుక్కల్ని కొట్టినట్లు కొడతావేంటి!!
Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి అధిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఇషాన్ కిషన్. అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు. అతడి ఎంట్రీనే ఇలా ఉంటే ఇక ముందు ప్రదర్శన ఎలా ఉంటుందో ఊహించుకుంటనే గూస్ బంప్స్ వస్తున్నాయి.

Ishan Kishan
ఇషాన్ కిషన్ : ఇప్పటికే హిట్టర్లతో నిండిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో మరో బిగ్ హిట్టర్ చేరాడు. వస్తూవస్తూనే సెంచరీతో అదగొట్టాడు. 'వీడెవడండీ బాబు... వచ్చిరాగానే ఇలా బాదుతున్నాడు'... ఇషాన్ కిషన్ క్రీజులో ఉంటే ప్రత్యర్థుల నోటినుండి వచ్చే మాట. హైదరాబాద్ బాషలో చెప్పాలంటే ఇషాన్ షాన్దార్ క్రికెటర్... దిల్దార్ మనిషి.
ఇషాన్ బ్యాట్ నుండి కేవలం ధనాధన్ షాట్లే కాదు సొగసరి టెక్నిక్ షాట్లు కూడా వస్తుంటారు. అవసరాన్ని బట్టి అతడు క్లాస్ గా కూడా బ్యాటింగ్ చేయగలడు... కానీ అతడి బలం మాత్రమే మాసే. తనదైనరోజు ప్రత్యర్థి బౌలర్లను కుక్కల్ని కొట్టినట్లు కొట్టగలడు... మైదానంలో పరుగులు సునామీ సృష్టించగలడు.
Ishan Kishan
ఇషాన్ భాయ్... ఇక ఇరగదీసేయ్..
''రాసిపెట్టుకొండి... ఈసారి సన్ రైజర్స్ కు కప్పు అందించి చూపిస్తా''... ఇది ఈ యువకెరటం కాన్ఫిడెంట్. ఈ సీజన్ లో జరిగిన మొదటిమ్యాచ్ చూస్తే అతడు చెప్పింది నిజం చేయగలడన్న నమ్మకం సన్స్ రైజర్స్ ఫ్యాన్స్ కు వచ్చింది. అయినా కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేయడమేంటి సామీ... అరాచకం కాకపోతే. ఇందులో నేరుగా బౌండరీని తాకిన 6 సిక్సర్లు, ఫీల్డర్ల మధ్యలోంచి దూసుకెళ్లిన 11 ఫోర్లు ఉన్నాయి. ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఇషాన్ కిషన్ షాన్దార్ క్రికెటర్ అనడానికి.
ముంబై నుండి హైదరాబాద్ టీంలో చేరిన ఇషాన్ ను అప్పుడు తెలుగు ఫ్యాన్స్ ముద్దుపేరు పెట్టేసారు. ఇబ్రహీంపట్నం ఇషాన్ అని పిలుచుకుంటున్నారు. మొదటి మ్యాచ్ లోనే విశ్వరూపం చూపించిన ఇకపై ఎలా ఆడతాడో ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వస్తారు. 'ఇషాన్ భాయ్... ఇక ఇరగదీసేయ్' అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంటున్నారు.
Ishan Kishan. (Photo- IPL)
ఇషాన్ కిషన్ ఐపిఎల్ కెరీర్ :
27 ఏళ్ల ఇషాన్ కిషన్ చాలాకాలం ముంబై ఇండియన్స్ తరపున ఐపిఎల్ లో ఆడాడు. అయితే ఇటీవల జరిగిన వేలంలో అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇలా ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ (106 పరుగులు నాటౌట్) బాది తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చాటిచెప్పాడు.
ఐపిఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన ఇషాన్ 2,750 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అతడి ఐపిఎల్ కెరీర్ లోబ ఏకంగా 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... తాజాగా ఓ సెంచరీ కూడా అతడి ఖాతాలో చేరింది.
ఇషాన్ కిషన్ 2020 ఐపిఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసాడు. ఈ సీజన్ లో ఏకంగా 516 పరుగులు బాదాడు. అప్పుడే సెంచరీని కేవలం ఒక్క రన్ తో మిస్సయ్యాడు... 99 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. అలాగే 2022 లో 418, 2023 లో 454 పరుగులు చేసాడు. గతేడాది 2024 లో కూడా 14 మ్యాచులాడి 320 పరుగులు చేసాడు ఇషాన్ కిషన్.