MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025లో గేమ్ ఛేజింగ్ రూల్ ! ఇక బ్యాట‌ర్ల‌కు ద‌బిడిదిబిడే !

IPL 2025లో గేమ్ ఛేజింగ్ రూల్ ! ఇక బ్యాట‌ర్ల‌కు ద‌బిడిదిబిడే !

IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఒక బిగ్ డిసిష‌న్ తీసుకుంది. ఐపీఎల్ లో కొత్త రూల్ తో పాటు ప‌లు మార్పులు తీసుకువ‌చ్చింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 21 2025, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
3 New Rules BCCI Introduced In Indian Premier League 2025

3 New Rules BCCI Introduced In Indian Premier League 2025

IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్  IPL 2025 థ్రిల్ కు వేదిక సిద్ధమైంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ కోసం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అలాగే, పాత నియమాల్లో పలు మార్పులు చేసింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత కొన్ని సంవత్సరాలుగా వ్యూహాత్మక టైమ్‌అవుట్‌లు, ఇంపాక్ట్ ప్లేయర్‌లతో సహా అనేక కొత్త రూల్స్ ను పరిచయం చేసింది. ఇప్పుడు IPL 2025 కి ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరొక కొత్త నియమాన్ని ప్రకటించింది. ఈ కొత్త రూల్ ఈ మెగా క్రికెట్ లీగ్ లో సాయంత్రం జరిగే మ్యాచ్‌లలో రెండవ ఇన్నింగ్స్‌లో వర్తిస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండవ ఇన్నింగ్స్‌లోని పదవ ఓవర్ తర్వాత బంతిని మార్చే ఎంపికను ఎంచుకోవడానికి జట్లకు అనుమతి ఉంటుంది. మ్యాచ్‌ల ఫలితంపై మంచు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నియమాన్ని ప్రవేశపెట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
IPL 2025 Rule: Second New Ball, Saliva Ban Lifted

IPL 2025 Rule: Second New Ball, Saliva Ban Lifted

సెకండ్ బాల్ రూల్ ఏమిటి?  

రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావాన్ని తగ్గించే విషయంలో రెండో బాల్ (రెండవ బంతి) నియమాన్ని ప్రవేశపెట్టారు. మంచు కారణంగా బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది, ఇది బ్యాట్స్‌మెన్‌కు, ముఖ్యంగా టార్గెట్ సయయంలో వారికి భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి IPL రాత్రి మ్యాచ్‌లలో రెండవ బంతిని ఉపయోగించడానికి అనుమతించే రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది. 

ఈ కొత్త రూల్ ప్రకారం.. రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అంపైర్ బంతి పరిస్థితిని అంచనా వేస్తాడు. అధిక మంచు కురుస్తున్నట్లు గుర్తించినట్లయితే, బౌలింగ్ జట్టు కొత్త బంతిని ఉపయోగించడానికి వీలు వుంటుంది. అంటే మ్యాచ్ లో మళ్లీ కొత్త బంతిని ఉపయోగించడం బౌలర్లకు అనుకూలించే అంశం అని చెప్పవచ్చు. అయితే, ఈ రెండో కొత్త బంతి రూల్ మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు వర్తించదు.

 

34
IPL 2025’s big rule changes

IPL 2025’s big rule changes

17 ఐపీఎల్ సీజన్ల హిస్టరీని గమనిస్తే.. రాత్రిళ్లు జరిగిన చాలా మ్యాచ్ లలో మంచు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు కారణంగా బౌలింగ్ చేయడం ప్లేయర్లకు సవాలుగా ఉంటుంది. మంచు ప్రభావం ఉంటే బ్యాటర్ల హవానే ఉంటుంది. అందుకే బ్యాట్, బాల్ మధ్య సరైన సమతుల్యతను తీసుకురావడానికి బీసీసీఐ ఈ రెండో బాల్ రూల్ ను తీసుకువచ్చింది.
 

44

బంతిని ఉమ్మితో రుద్దవచ్చు !

ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ కొన్ని విషయాల్లో మార్పులు తెచ్చింది. అదే బంతని ఉమ్మి (లాలాజలం)తో రుద్దడం. ఐపీఎల్ లో పాల్గొంటున్న చాలా మంది కెప్టెన్ల ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో రాబోయే ఐపీఎల్‌లో బంతిపై లాలాజలం వాడకంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. 

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా బంతిపై ఉమ్మివేసి రుద్దడాన్ని బీసీసీఐ నిషేధించింది. మార్చి 22 నుండి ఈ మెగా క్రికెట్ లీగ్ ప్రారంభం కావడానికి ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బాల్ పై ఉమ్మివేసి రుద్దే నియమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బంతిని గ్రిప్ తో పట్టుకోవడానికి  మరింత వీలుకలుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
భారత దేశం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Recommended image2
IND vs NZ: న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. మనోడి దెబ్బకు కుప్పకూలిన కివీస్
Recommended image3
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved