MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RCB vs KKR:కేకేఆర్ ను దెబ్బ‌కొట్టిన వ‌ర్షం..ప్లేఆఫ్స్ నుంచి మ‌రో జ‌ట్టు అవుట్

RCB vs KKR:కేకేఆర్ ను దెబ్బ‌కొట్టిన వ‌ర్షం..ప్లేఆఫ్స్ నుంచి మ‌రో జ‌ట్టు అవుట్

IPL 2025 RCB vs KKR: భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల త‌ర్వాత తాత్కాలికంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 శనివారం తిరిగి ప్రారంభమైంది. అయితే, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు అయింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2025, 11:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

IPL 2025 RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన కీలక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకముందే మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు జట్లకు చెరో ఒక పాయింట్ ద‌క్కింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
RCB vs KKR

RCB vs KKR

భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల త‌ర్వాత తాత్కాలికంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కాగా.. ఇప్పుడు తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) త‌ల‌ప‌డ్డాయి. అయితే టాస్ ప‌డ‌కుండానే ఈ మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు అయింది. 

36
KKR vs RCB

KKR vs RCB

మ్యాచ్ ర‌ద్దుతో కేకేఆర్ జట్టు ప్లేఆఫ్ రేసు నుండి అవుట్ అయింది. ఇప్పటివరకు 12 పాయింట్లు ఉన్న కోల్‌కతా జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్‌ అవకాశాలను నిలుపుకోగలిగేది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో కోల్‌కతా ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్‌కు అర్హత పొందలేని నాలుగో జట్టుగా నిలిచింది. 

46
RCB vs KKR

RCB vs KKR

కోల్ క‌తా ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్ లు ఆడి కేవ‌లం 12 పాయింట్లు మాత్ర‌మే సాధించింది. మ‌రో వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ 17 పాయింట్ల‌తో టేబుల్ టాపర్ గా కొన‌సాగుతోంది. ఆర్సీబీ 12 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల‌ను గెలుచుకుంది. కేకేఆర్ తో మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఒక పాయింట్ అందుకుంది. ఆర్సీబీ మ‌రో ఒక్క విజ‌యాన్ని సాధిస్తే ప్లేఆఫ్ బెర్త్ ను అధికారికంగా క‌న్ఫార్మ్ చేసుకుంటుంది. 

56
RCB vs KKR

RCB vs KKR

వ‌ర్షం త‌గ్గితే మ్యాచ్ ను నిర్వ‌హించ‌డానికి అంపైర్లు రాత్రి 10:56 వరకు చూశారు. ఇక‌ కట్ ఆఫ్ టైమ్ గా దాటిన త‌ర్వాత కూడా వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ను ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు చేరో పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ సాగ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశగా స్టేడియాన్ని వీడారు. 

 

66

చిన్నస్వామి వేదికగా ఐపీఎల్ 2025కి తిరిగి ప్రారంభం కావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వర్షం ఈ భారీ మ్యాచ్‌ను దెబ్బతీసింది. అంపైర్లు, ఆర్గనైజర్లు వాతావరణాన్ని పర్యవేక్షిస్తూ మ్యాచ్‌ను కొనసాగించేందుకు కృషి చేసినప్పటికీ, వర్షం ఆగ‌క‌పోవ‌డంతో చివరికి మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL : రోహిత్ శర్మ vs విరాట్ కోహ్లీ.. 18 ఏళ్ల ఐపీఎల్ లో ఎవరు కింగ్?
Recommended image2
IPL 2025 : హయ్యెస్ట్ సిక్సర్లు బాదిన టాప్ 5 హిట్టర్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved