MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • World Cup 2027: వన్డే వరల్డ్ కప్‌ 2027 లో కోహ్లీయే కింగ్.. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాకే !

World Cup 2027: వన్డే వరల్డ్ కప్‌ 2027 లో కోహ్లీయే కింగ్.. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాకే !

World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 జరిగే స్టేడియాల్లో విరాట్ కోహ్లీ రికార్డులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 25 ఇన్నింగ్స్‌ల్లో 71.47 సగటుతో 1358 రన్స్ బాదాడు. మరో ఐసీసీ ట్రోఫీని భారత్ కు అందించడానికి కింగ్ కోహ్లీ సిద్ధంగా ఉన్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 11 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వన్డే వరల్డ్ కప్ 2027: సౌతాఫ్రికాలో విరాట్ కోహ్లీ విధ్వంసం
Image Credit : Chatgpt

వన్డే వరల్డ్ కప్ 2027: సౌతాఫ్రికాలో విరాట్ కోహ్లీ విధ్వంసం

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 స్టేడియాల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. వీటికి సంబంధించిన స్టేడియాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల ప్రకటించింది. 24 ఏళ్ల విరామం తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తోంది. దాంతో ఈ టోర్నీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ 2027 క్రికెట్ వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పోటీపడనున్నాయి. కొత్త టోర్నమెంట్ ఫార్మాట్ కింద మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. అత్యధిక మ్యాచ్‌లకు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తుండగా, మిగిలిన కొన్ని మ్యాచ్‌లను జింబాబ్వే, నమీబియా దేశాలు నిర్వహించనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా
Image Credit : bcci

కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా

ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్స్ షురూ చేసింది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఒక బలమైన వన్డే జట్టును నిర్మించే పనిలో బోర్డు ఉంది. అయితే, క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. 2027 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడాలని కోట్లాది మంది క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు.

ఒకవేళ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడితే, అది ఐసీసీ టోర్నమెంట్‌లో అతడికి ఆఖరి మ్యాచ్ లు అయ్యే అవకాశం ఉంది. ఈ దిగ్గజ ప్లేయర్‌ను మరోసారి వరల్డ్ కప్ లో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Related image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Related image2
India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్
35
సౌతాఫ్రికా లో కింగ్ కోహ్లీ ఊచకోత
Image Credit : Getty

సౌతాఫ్రికా లో కింగ్ కోహ్లీ ఊచకోత

విరాట్ కోహ్లీ కూడా తన అత్యుత్తమ ప్రదర్శనల ద్వారా 2027 వన్డే వరల్డ్ కప్‌యే తన తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇటీవల వన్డేల్లో కోహ్లీ ఫామ్, సౌతాఫ్రికాలో అతనికి ఉన్న అద్భుతమైన రికార్డులు ఈ అంచనాలను మరింత పెంచేశాయి. సౌతాఫ్రికా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. 2027 వరల్డ్ కప్‌ కోసం ఎంపిక చేసిన 12 స్టేడియాల్లో కోహ్లీకి కళ్లు చెదిరే ట్రాక్ రికార్డ్ ఉంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో ఉన్న ఈ 12 ఖరారైన స్టేడియాల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 25 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో ఏకంగా 71.47 సగటుతో 1,358 పరుగులు సాధించాడు.

45
వర్తమాన క్రికెటర్లలో కోహ్లీకి సాటిరాని రికార్డు
Image Credit : Getty

వర్తమాన క్రికెటర్లలో కోహ్లీకి సాటిరాని రికార్డు

ఈ 25 ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే కోహ్లీ 4 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదాడు. అలాగే 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఆఫ్రికా పిచ్‌లపై కోహ్లీ సాధించిన గణాంకాలు చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టడం ఖాయం. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, ఈ వరల్డ్ కప్ స్టేడియాల్లో వర్తమాన భారత ఆటగాళ్లలో ఎవరూ కూడా విరాట్ కోహ్లీ చేసిన పరుగుల్లో సగం పరుగులు కూడా సాధించలేదు.

• ఆడిన వన్డే ఇన్నింగ్స్‌లు: 25

• చేసిన పరుగులు: 1,358

• బ్యాటింగ్ సగటు: 71.47

• సెంచరీలు: 4

• అర్థ సెంచరీలు: 9

• మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు: 5

55
ఐసీసీ కప్ వేటలో భారత్‌కు విరాట్ కోహ్లీయే ప్రధాన బలం
Image Credit : BCCI

ఐసీసీ కప్ వేటలో భారత్‌కు విరాట్ కోహ్లీయే ప్రధాన బలం

ప్రస్తుత భారత క్రికెటర్లలో సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ ఆడినంత క్రికెట్ మరెవరూ ఆడలేదు. అక్కడి పిచ్‌ల స్వభావం, బౌన్స్, కండిషన్స్‌పై కోహ్లీకి పూర్తి అవగాహన ఉంది. విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే, 2027 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత బ్యాటింగ్ రంగానికి అతడే వెన్నెముకగా నిలుస్తాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో జరిగే ఈ ఆఫ్రికా టూర్నమెంట్‌లో టీమ్ ఇండియా ట్రోఫీని గెలవాలంటే కింగ్ కోహ్లీ అనుభవం, అద్భుతమైన రికార్డులు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్
Recommended image2
IND vs SL: ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. ఫాస్ట్ బౌలర్ విధ్వంసానికి గౌతమ్ గంభీర్ షాక్
Recommended image3
IND vs SL: శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గౌతమ్ గంభీర్ బిగ్ వార్నింగ్
Related Stories
Recommended image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved