MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్

India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్

India Cricket: టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ సహా 10 మందికి పైగా ప్లేయర్లు బెంగళూరు సీఓఈలో కోలుకుంటున్నారు. ఈ గాయాలు భారత జట్టు విజయాల పై ప్రభావం చూపిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెంగళూరు ఎన్‌సిఏలో 10 మందికి పైగా క్రికెటర్లు.. అసలు భారత జట్టుకు ఏమైంది?
Image Credit : AFP

బెంగళూరు ఎన్‌సిఏలో 10 మందికి పైగా క్రికెటర్లు.. అసలు భారత జట్టుకు ఏమైంది?

భారత క్రికెట్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో మ్యాచ్ సెలెక్షన్లలో మార్పులు చేయక తప్పడం లేదు. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే భారత జట్టులో ప్రస్తుతం 10 మందికి పైగా ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. గాయపడిన ఆటగాళ్ల సంఖ్య పెరగడంతో జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బెంగళూరు సీఓఈలో రిహాబ్ పొందుతున్న ప్లేయర్లు
Image Credit : Asianet News

బెంగళూరు సీఓఈలో రిహాబ్ పొందుతున్న ప్లేయర్లు

భారత జట్టులోని పలువురు రెగ్యులర్ ఆటగాళ్లు వేర్వేరు గాయాలతో సతమతమవుతున్నారు. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన వరుసగా మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరితో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు కూడా గాయాలతో బాధపడుతున్నారు.

36
బిజీ షెడ్యూల్ తెచ్చిపెట్టిన తిప్పలు
Image Credit : Asianet News

బిజీ షెడ్యూల్ తెచ్చిపెట్టిన తిప్పలు

వరుసగా సాగుతున్న బిజీ క్రికెట్ షెడ్యూల్ ఆటగాళ్ల శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇటీవల భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లలో వరుసగా ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. అయితే జింబాబ్వే పర్యటనలో భాగంగా జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి కాస్త ఊపిరి పీల్చుకుంది.

46
రాబోయే కీలక సిరీస్‌ల సవాలు
Image Credit : X/BCCI

రాబోయే కీలక సిరీస్‌ల సవాలు

రాబోయే రోజుల్లో భారత జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్‌లు ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ చేరే అవకాశాలను బలపరుచుకోవడానికి భారత జట్టు విదేశీ గడ్డపై శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో రెండూ గెలవడం జట్టుకు చాలా ముఖ్యం. ఆ తర్వాత స్వదేశంలో వెస్ట్ ఇండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఆ వెంటనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ 5 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌ను తట్టుకోవాలంటే ప్రధాన ఆటగాళ్లంతా త్వరగా ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావాల్సి ఉంది.

56
గాయపడిన భారత ఆటగాళ్ల పూర్తి జాబితా
Image Credit : Asianet News

గాయపడిన భారత ఆటగాళ్ల పూర్తి జాబితా

ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్న భారత ఆటగాళ్లు, వారి గాయాల వివరాలు ఇలా ఉన్నాయి..

• హర్షిత్ రాణా: హ్యామ్‌స్ట్రింగ్ గాయం

• హార్దిక్ పాండ్యా: క్వాడ్రిసెప్స్ గాయం / స్ట్రెయిన్

• జస్ప్రీత్ బుమ్రా: మోకాళ్ల వాపు సమస్య

• నితీష్ రెడ్డి: హ్యామ్‌స్ట్రింగ్ గాయం

• వాషింగ్టన్ సుందర్: క్వాడ్రిసెప్స్ సమస్య

• ఆకాష్ దీప్: లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్

• సాయి సుదర్శన్: కాలి వేలి స్ట్రెస్ ఫ్రాక్చర్

• శుభ్‌మన్ గిల్: కుడి చేతి ఉంగరపు వేలి గాయం

• వరుణ్ చక్రవర్తి: హ్యామ్‌స్ట్రింగ్ టీర్

• రియాన్ పరాగ్: కుడి భుజం గాయం

• అశోక్ శర్మ: లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్

• సుయాష్ శర్మ: మోకాలి గాయం

• యుధ్‌వీర్ సింగ్: కుడి భుజం గాయం

66
లంకతో టెస్ట్ సిరీస్
Image Credit : Getty

లంకతో టెస్ట్ సిరీస్

శ్రీలంకతో భారత్ ఆడనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2026 ఆగస్టు 15న ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత జట్టులో యాక్టివ్‌గా ఉన్న 9 మంది కీలక ఆటగాళ్లు గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లకు స్వల్ప గాయాలు మాత్రమే ఉండటంతో, వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే శ్రీలంక సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆటగాళ్లంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
Govinda: ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved