Numerology: ఐపీఎల్ 2025 ట్రోఫీని విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ గెలుస్తుందా? లేదా?
IPL 2025 RCB Trophy Prediction Numerology: తాత్కాలికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మే 17 ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ టైటిల్ మాదే అంటోంది విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ. మరి ట్రోఫీ గెలుచుకునే అవకాశాలపై సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది? ఈసారైనా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందా? లేదా?

IPL 2025 RCB: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మళ్ళీ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆర్సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రదర్శనను చూస్తే ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది.
ఇప్పుడు ఆర్సీబీకి సంఖ్యాశాస్త్రం బలం కూడా లభించింది.భారత్-పాకిస్తాన్ సరిహద్దు సంఘర్షణ కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిలిపివేయబడింది. ఇప్పుడు మే 17 నుండి టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరుగుతుంది. అన్ని సంఖ్యలు ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. ఆర్సీబీ మంచి ప్రదర్శనతో పాటు సంఖ్యాశాస్త్రం కూడా బలాన్నిస్తుంది.
ఐపీఎల్ 2025 ట్రోఫీ ఆర్సీబీదే అంటోంది న్యూమరాలజీ.
ఐపీఎల్ ఫైనల్ తేదీ: 6-03-2025
6+3+2+0+2+5 = 18
విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్= 18
ఐపీఎల్ 2025 = 18వ ఎడిషన్
ఆర్సీబీలోని మొదటి ఆంగ్ల అక్షరం R = ఆంగ్లంలో 18వ అక్షరం
ఇలా సంఖ్యాశాస్త్రం, ప్రదర్శనలు అన్నీ ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైన ప్రదర్శనతో బెంగళూరు టీమ్ ఆడిన 11 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లలో గెలిచింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండవ స్థానంలో ఉంది. మే 17న బెంగళూరు టీమ్ చిన్నస్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ ఆడనుంది.
గత అన్ని సీజన్ల కంటే ఈసారి ఆర్సీబీలో మరో ప్రత్యేకత ఉంది. ఈసారి ఆర్సీబీ జట్టుగా ప్రదర్శన ఇస్తోంది. కోహ్లీపైనే ఆధారపడే పరిస్థితి నుండి బయటపడింది. విరాట్ కోహ్లీ కూడా మంచి ప్రదర్శన ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కోహ్లీతో పాటు ఇతరులు కూడా మంచి పోరాటం చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంగా ఆర్సీబీ ఉంది.
న్యూమరాలజీతో పాటు జట్టు ప్రదర్శనలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు ఇలా ఈసారి అన్నీ ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. గత 17 సీజన్లలో ఆర్‌సిబి ట్రోఫీని గెలవలేకపోయింది. మొదటిసారి ట్రోఫీ గెలిచే అవకాశం ఆర్సీబీ ముందుంది. అభిమానులు ట్రోఫీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. ఆర్‌సిబి ట్రోఫీ గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని సంబరాలు అభిమానులు చేయడం పక్కా. ఐపీఎల్ లో ఆర్సీబీ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.