ఐపీఎల్ లో 5 జట్లకు కొత్త కెప్టెన్లు.. కొత్తకొత్తగా జట్లు..
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో చాలా మార్పులు జరగబోతున్నాయి. వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలంతో జట్లలోని ప్లేయర్లు మారనున్నారు. జట్లకు కొత్త ప్లేయర్లతో పాటు కొత్త కెప్టెన్లు కూడా రానున్నారు.
Rohit, Rahul, Shikhar, Dinesh
IPL 2025 : రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. మెగా వేలం క్రమంలో తీసుకురాబోయే మార్పులకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. వేలంతో జట్ల స్వరూపం పూర్తిగా మారనుంది. కొత్త ప్లేయర్లతో పాటు కొత్త కెప్టెన్లు కూడా కనిపించనున్నారు. చాలా మంది ఆటగాళ్లు వేలంలో టీమ్స్ మారే అవకాశం ఉంది. జట్ల మార్పులపై ఇప్పటికే మీడియాలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా కెప్టెన్ల మార్పులు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు చూస్తే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్‌ను తీసుకోవడంతో పాటు అతనికి కెప్టెన్సీ ఇవ్వనున్నారనే టాక్ నడుస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్ తన కెరీర్ చివరి దశలో ఉన్నందున, కర్నాటకకు చెందిన, వివిధ ఫ్రాంఛైజీలకు ఆడిన అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ నాయకత్వ పాత్రను పోషించడానికి సరైన ఆటగాడిగా ఆర్సీబీ భావిస్తోంది. ఆర్సీబీని నడిపించడానికి కేఎల్ రాహుల్ సరైన ఎంపిక కావచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్‌జెయింట్స్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై చెబుతారని సమాచారం. గత సీజన్‌లో ఎల్ఎస్జీ మేనేజ్‌మెంట్‌తో వివాదం తర్వాత ఫ్రాంచైజీ అతనిని కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ కూడా జట్టులో కొనసాగడానికి సుముఖంగా లేరని సమాచారం. దీంతో లక్నో టీమ్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి కోసం జట్టు ప్రయత్నాలు చేస్తోంది. వీరిలో ఎవరైనా ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే లక్నో జట్టు వారిని తీసుకుని కెప్టెన్‌గా చేయనుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్
ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును వీడవచ్చని సమాచారం. ఇదే జరిగితే, క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ కావాలి. ఫ్రాంచైజీని నడిపించగల అనుభవజ్ఞులైన అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మెగా వేలానికి ముందు జట్టులో అట్టిపెట్టుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లలో అక్షర్ కూడా ఒకడు. ఢిల్లీ జట్టు యువ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని భావిస్తే అక్షర్ సరైన ఎంపిక కావచ్చు. ఇదే సమయంలో మరో స్టార్ సీనియర్ ప్లేయర్ వైపు కూడా చూడవచ్చు.
పంజాబ్ కింగ్స్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ నిరాశాజనక ప్రదర్శన గత సీజన్‌లోనూ కొనసాగింది. వీరి కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఈ సారి వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను చూడవచ్చు. యువ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇదే జరిగితే జట్టుకు కొత్త కెప్టెన్ రావచ్చు.
Hardik-Rohit
ముంబై ఇండియన్స్
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. అయితే హార్దిక్ సారథ్యంలో ముంబై పెద్దగా విజయం సాధించలేదు. హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. జట్టుకు విజయాలు అందించడంలో కూడా పాండ్యా విఫలమయ్యాడు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ భారత జట్టును టీ20 ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇలాంటి సమయంలో మళ్లీ ముంబై కెప్టెన్సీని రోహిత్ కు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిత్‌ని మళ్లీ ముంబై కెప్టెన్‌గా చేయాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే జరిగితే హార్దిక్ ను వైస్ కెప్టెన్ చూడవచ్చు.