MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • DC vs RR : మిస్సైల్ స్టార్ మ్యాజిక్ : సూపర్ ఓవర్ పోరులో డిల్లీదే విజయం

DC vs RR : మిస్సైల్ స్టార్ మ్యాజిక్ : సూపర్ ఓవర్ పోరులో డిల్లీదే విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో మొదటిసారి ఓ మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ జరిగింది. డిల్లీ క్యాపిటల్స్, రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. సొంత గడ్డపై డిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 

Arun Kumar P | Updated : Apr 17 2025, 12:28 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
DC vs RR Indian Premier League 2025

DC vs RR Indian Premier League 2025

DC vs RR Indian Premier League 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో మరో ఉత్కంఠ పోరుకు డిల్లీ స్టేడియం వేదికయ్యింది. రెండు టీంలు సమాన స్కోరు 188 పరుగులే సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది... దీంతో ఈ సీజన్లో మొదటిసారి సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. డిల్లీ కేవలం బంతుల్లోనే పని కానిచ్చేసారు... మరో రెండు బంతులు మిగిలుండగానే 13 పరుగులు బాదారు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ 3 బంతుల్లో 7 పరుగులు, స్టబ్స్ ఒకే బంతిని ఎదుర్కొని సిక్స్ బాదాడు. దీంతో డిల్లీని విజయం వరించింది. 

ముందుగా రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయగా మిచెల్ స్టార్క్ మిస్సైల్ లాంటి బంతులతో మ్యాజిక్ చేసాడు. అతడు వరుసగా రెండు బంతుల్లో ఇద్దరు బ్యాట్స్ మెన్స్ రనౌట్ చేసాడు. ఇలా పరాగ్, హెట్మెయర్ రనౌట్ కావడంతో మరో బంతి మిగిలుండగానే రాజస్థాన్ సూపర్ ఓవర్ ను ముగించింది. స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోలేక రాజస్థాన్ టీం కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది. 

23
DC vs RR

DC vs RR

డిల్లీ ఇన్నింగ్స్ సాగిందిలా : 
 
సొంత మైదానంలో ఆడుతున్న డిల్లీకి మంచి ఆరంభం లభించింది. యువ ఓపెనర్ అభిషేక్ పొరేల్ రెండో ఓవర్లో విధ్వంసం చేసాడు... 4,4,6,4,4,1 తో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త స్లో అయ్యింది. అభిషేక్ కేవలం 37 బంతుల్లో 49 పరుగులు చేసాడు.  

గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరణ్ నాయర్ డకౌట్ అయ్యాడు... అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మెక్ గర్క్ కూడా కేవలం 9 పరుగులే చేసాడు. ఇక రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులతో సందర్భోచితంగా ఆడాడు. చివర్లో స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు రాణించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు... కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు.  

మొత్తంగా డిల్లీ బ్యాటింగ్ ఆరంభం, ఫినిషింగ్ అదిరింది. మొదట్లో ఓపెనర్ పొరేల్.. చివర్లో అక్షర్, స్టబ్స్ పరుగులు రాబట్టారు. దీంతో డిల్లీ సొంత మైదానంలో మంచి స్కోరు సాధించింది.  నిర్ఱీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 

33
DC vs RR

DC vs RR

రాజస్థాన్ బ్యాటింగ్ సాగిందిలా :

189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వార్ కేవలం 37 బంతుల్లో 51 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. ఓపెనర్లిద్దరు అద్బుతంగా ఆడుతున్న సమయంలో శాంసన్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 

ఇక చివర్లో నితీష్ రానా, ద్రువ్ జురేల్ మెరుపులు మెరిపించారు.  నితీష్ కేవలం 28 బంతుల్లో 51 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జురేల్ 17 బంతుల్లో 26 పరుగులు (2 సిక్సర్లు) చేసారు. చివర్లో హెట్మెయర్ 9 బంతుల్లో 15 పరుగులు చేసాడు.  

అయితే చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు చేయాల్సి ఉండగా డిల్లీ బౌలర్ మ్యాజిక్ చేసాడు. యార్కర్ బంతులతో విరుచుకుపడి రాజస్థాన్ హిట్టర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.., ఇలా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్లోనూ స్టార్ మాయ కొనసాగింది. 
 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
భారత దేశం
 
Recommended Stories
Top Stories