సెకండ్ మ్యాచ్ లోనే సెంచరీతో రికార్డుల మోత మోగించిన అభిషేక్ శర్మ
Abhishek Sharma's century records : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. 100 పరుగుల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ సెంచరీతో అనేక రికార్డులు నమోదుచేశాడు.
Abhishek Sharma, Team India, Cricket
Abhishek Sharma's century records : ఐపీఎల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడి భారత టీ20 జట్టులో చోటుదక్కించుకున్న యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి సెంచరీని సాధించాడు. తన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డకౌడ్ అయిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో తన బ్యాట్ పవర్ చూపిస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
Abhishek Sharma
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 100 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించడంతో టీమిండియా 234/2 (20) పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా సూపర్ బౌలింగ్ తో జింబాబ్వే 134 (18.4) పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు. తన 100 పరుగుల ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే అనేక రికార్డులు సాధించాడు.
Abhishek Sharma
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని సాధించిన అభిషేక్ శర్మ.. భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ప్లేయర్ల క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున టీ20ల్లో సెంచరీలు సాధించిన 10 ప్లేయర్ గా నిలిచాడు.
కేవలం 46 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా కేఎల్ రాహుల్ సరసన చేరాడు.
ఇదివరకు కేఎల్ రాహుల్ కూడా 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. హిట్ మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే రోహిత్ సెంచరీ కొట్టాడు.ఆ తర్వాత 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.
మరో విషేశం ఏమిటంటే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సిక్సర్ తో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. మళ్లీ సిక్సర్ తోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత సెంచరీ కూడా సిక్సర్ తోనే అందుకుని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Image Credit: Abhishek Sharma Instagram
అభిషేక్ శర్మ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. తన రెండో ఇన్నింగ్స్ లోనే సెంచరీ కొట్టాడు. అంతకుముందు, దీపక్ హుడా సెంచరీ చేయడానికి 3 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ తన నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు.
Abhishek Sharma
భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడైన ఆటగాడు అభిషేక్ శర్మ. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ సెంచరీ సాధించాడు. అంతకుముందు, యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయసులో సెంచరీ సాధించి అతిపిన్న వయస్కుడిగా టాప్ లో ఉన్నాడు.