MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీని చెప్పిమ‌రీ ఔట్ చేస్తున్న బౌలర్

విరాట్ కోహ్లీని చెప్పిమ‌రీ ఔట్ చేస్తున్న బౌలర్

Virat Kohli: ఇంగ్లాండ్ తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే, విరాట్ కోహ్లీ ఒక బౌల‌ర్ చెప్పి మ‌రీ మ‌రోసారి ఔట్ చేశాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 12 2025, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Virat Kohli: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో భార‌త జ‌ట్టు మూడో వ‌న్డే ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ ను అందుకున్నాడు. 

విరాట్ కోహ్లీకి ఇది 73వ హాఫ్ సెంచరీ. మంచి క్లాసిక్ గేమ్ ఆడుతున్న కింగ్ కోహ్లీ సెంచ‌రీ చేస్తాడ‌ని అభిమానులు ఆశించారు. కానీ, హాఫ్ సెంచ‌రీ త‌ర్వ‌త కోహ్లీ ఔట్ అయ్యాడు. అయితే, గ‌త కొన్ని మ్యాచ్ లు గా విరాట్ కోహ్లీని ఒక బౌల‌ర్ చెప్పిమ‌రీ ఔట్ చేస్తున్నాడు.

25
Image Credit: Getty Images

Image Credit: Getty Images

మంచి ట‌చ్ లో కింగ్ కోహ్లీ 

ఈ మ్యాచ్ లో క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నుంచి విరాట్ కోహ్లీ మంచి టచ్ లో క‌నిపించాడు. త‌న‌దైన షాట్స్ ఆడుతూ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మ‌రిన్ని ప‌రుగులు ఆశించిన ఇండియాకు, క్రికెట్ ల‌వ‌ర్స్ కు నిరాశే ఎదురైంది. కోహ్లీ 52 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు. 

విరాట్ తన వన్డే కెరీర్‌లో 51వ సెంచరీ సాధిస్తాడని అనిపించింది, కానీ అతను ఆదిల్ రషీద్ చేతికి చిక్కాడు. ఆదిల్ బౌలింగ్ లో కోహ్లీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు.

35
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఆదిల్ ర‌షీద్ బౌలింగ్ వ‌రుస‌గా వికెట్ కోల్పోతున్న విరాట్ కోహ్లీ 

ఈ సిరీస్ లో మ‌రోసారి కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌల‌ర్ ఆదిల్ ర‌షీద్ చేతి చిక్కి పెవిలియ‌న్ కు చేరాడు. వన్డే క్రికెట్ లో కోహ్లీని ఆదిల్ అవుట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ లెజెండరీ ఇంగ్లాండ్ స్పిన్నర్ వన్డేలో ఐదవసారి విరాట్‌ను తన బాధితుడిగా చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ చాలా సార్లు ఆదిల్ ర‌షీద్ లెగ్ స్పిన్ ఎదుర్కోవ‌డంలో ఇబ్బందిప‌డుతూనే ఉన్నాడు. అహ్మదాబాద్‌లో ఇది క‌నిపించింది. ఒకసారి ఆదిల్ అతనికి వ్యతిరేకంగా LBW కోసం బలమైన అప్పీల్ కూడా చేసాడు, కానీ విరాట్ ఆ స‌మ‌యంలో తప్పించుకున్నాడు.

45
Image Credit: Getty Images

Image Credit: Getty Images

కోహ్లీని 10 సార్లు ఔట్ చేసిన ఆదిల్ ర‌షీద్ 

కోహ్లీ ఇప్పటివరకు 10 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆదిల్ రషీద్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అతను 130 బంతుల్లో 112 పరుగులు చేశాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీని ఆదిల్ ర‌షీద్ 5 సార్లు ఔట్ చేశాడు.  మొత్తంగా 11 సార్లు కోహ్లీని పెవిలియన్ కు పంపాడు.

ఆదిల్ పై విరాట్ సగటు 22.40, స్ట్రైక్ రేట్ 86.15గా ఉంది. ఈ గణాంకాలను చూస్తే వన్డేల్లో ఆదిల్ రషీద్ బౌలింగ్ ను విరాట్ కోహ్లీ ఎదుర్కోవ‌డానికి ఎంత‌లా ఇబ్బంది ప‌డుతున్నాడో తెలుస్తోంది. 

2024 నుండి వన్డేలలో లెగ్ స్పిన్‌పై విరాట్ రికార్డు గొప్ప‌గా లేవు. లెగ్ స్పిన్ బౌలింగ్ లో పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరాడు. 

ఇన్నింగ్స్: 4
బంతులు: 40
పరుగులు: 26
అవుట్లు: 4

55

గిల్ తో సెంచరీ భాగస్వామ్యంతో మెరిసిన కోహ్లీ 

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో ఓవర్ తొలి బంతికే రోహిత్‌ను వికెట్ కోల్పోయింది భారత్. రోహిత్ రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. విరాట్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి టీమిండియాను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (52 పరుగులు), గిల్ సెంచరీ (112 పరుగులు) చేశారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ 78 పరుగులు, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేయడంతో భారత్ 356 పరుగులకు ఆలౌట్ అయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL హిస్టరీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన టాప్ 10 భారత ప్లేయర్లు ఎవరు?
Recommended image2
వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మనోళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసా? సంజూ మాస్ రోడ్ ట్రిప్
Recommended image3
RCB vs SRH : హైదరాబాద్ కొట్టే రన్స్ ఓకే.. IPL 2026 లో వికెట్లు తీసేదెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved