MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • సెంచ‌రీతో శుభ్‌మన్ గిల్ సాధించిన రికార్డులు ఇవే

సెంచ‌రీతో శుభ్‌మన్ గిల్ సాధించిన రికార్డులు ఇవే

Shubman Gill's century records: మూడో వ‌న్డేలో ఇంగ్లాండ్ పై ఇండియా సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంలో  కీల‌క పాత్ర పోషించిన శుభ్ మ‌న్ గిల్ త‌న సెంచ‌రీతో అనేక రికార్డులు సాధించాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2025, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shubman Gill

Shubman Gill

Shubman Gill's century records: అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన మూడో మ్యాచ్ లో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంలో భార‌త యంగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ మొత్తంగా సూప‌ర్ బ్యాటింగ్ తో గిల్ అద‌ర‌గొట్టాడు. అనేక రికార్డులు సాధించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సూపర్ ఫామ్ లో శుభ్‌మన్ గిల్

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో అతను వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. ఐసీసీ మెగా టోర్నీకి ముందు ఇది భారత జట్టుకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. 

బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు కూల్ నెస్ కూడా కనిపించింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లతో క‌లిసి ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అద్భుత‌మైన సెంచ‌రీ కొట్టాడు. 

35

సెంచ‌రీతో రికార్డుల మోత మోగించిన శుభ్ మ‌న్ గిల్ 

ఇంగ్లాండ్ తో జ‌రిగిన మూడో మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో తన 50వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే, 50 ఇన్నింగ్స్‌లలో ఏడు వన్డే సెంచరీలు చేసిన అత్యంత వేగవంతమైన ప్లేయ‌ర్ గా నిలిచాడు. 

వీటితో పాటు మూడు ఫార్మాట్లలో ఒకే వేదికపై సెంచరీ చేసిన ఐదవ క్రికెటర్, మొదటి భారతీయ ప్లేయ‌ర్ గా గిల్ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి రికార్డును సాధించ‌లేక‌పోయారు. 

45
Image Credit: Getty Images

Image Credit: Getty Images

మూడు ఫార్మాట్లలో ఒకే వేదికపై సెంచరీలు చేసిన ట‌ప్-5 ప్లేయ‌ర్లు 

ఫాఫ్ డు ప్లెసిస్ (సౌతాఫ్రికా) - వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - అడిలైడ్ ఓవల్
బాబర్ అజామ్ (పాకిస్తాన్) - నేషనల్ స్టేడియం, కరాచీ
క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా) - సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్
శుభ్‌మన్ గిల్ (ఇండియా) - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

55

అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ రికార్డులు

అహ్మదాబాద్‌లో గిల్ అనేక రికార్డులు సాధించాడు. ఇక్క‌డ ఆడిన‌ 4 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో గిల్ సగటు 51.33గా ఉంది. ఇక్కడ ఒక టెస్ట్‌లో సెంచరీ చేశాడు. వన్డేల్లో మూడు 3 ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేశాడు. ఒక T20 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ సాధించాడు.

గిల్ ఐపీఎల్‌లో న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ స‌మ‌యంలో 3 సెంచరీలు సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సూప‌ర్ రికార్డులు క‌లిగిన గిల్ మ‌రోసారి ఇంగ్లాండ్ పై సెంచ‌రీ బాది భార‌త జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved