MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs WI: భారత జట్టు ఓటమికి 5 కారణాలు ఇవే.. వెస్టిండీస్‌తో ఉత్కంఠ పోరులో టీమిండియా చిత్తు

IND vs WI: భారత జట్టు ఓటమికి 5 కారణాలు ఇవే.. వెస్టిండీస్‌తో ఉత్కంఠ పోరులో టీమిండియా చిత్తు

India vs West Indies: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన 4వ టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఫలితాన్ని మార్చిన 5 కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 15 2026, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్ కొంపముంచిన ఆ పొరపాట్లు ఇవే.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా షాకింగ్ ఓటమి
Image Credit : ANI

భారత్ కొంపముంచిన ఆ పొరపాట్లు ఇవే.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా షాకింగ్ ఓటమి

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంay వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక దశలో తడబడింది. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. అతను కేవలం 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత్ విజయ అవకాశాలను దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడం భారత్ పతనానికి ప్రధాన కారణమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిడిలార్డర్ వైఫల్యం.. బిగ్ టార్గెట్ ఒత్తిడి
Image Credit : X

మిడిలార్డర్ వైఫల్యం.. బిగ్ టార్గెట్ ఒత్తిడి

248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలో అభిషేక్ శర్మ పర్వాలేదనిపించినా, మిడిలార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేసి వెనుదిరిగారు. నితీష్ కుమార్ రెడ్డి (41 పరుగులు), తిలక్ వర్మ (43 పరుగులు) పోరాడినప్పటికీ, రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వికెట్లు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో భారత్ లక్ష్యానికి దూరమైంది.

35
పవర్‌ప్లే తర్వాత నెమ్మదించిన రన్ రేట్
Image Credit : ANI

పవర్‌ప్లే తర్వాత నెమ్మదించిన రన్ రేట్

మొదటి ఆరు ఓవర్లలో టీమిండియా మంచి స్కోరు సాధించినా, మధ్య ఓవర్లలో వెస్టిండీస్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో టీమిండియాను అడ్డుకున్నారు. గుడాకేష్ మూతీ, రోస్టన్ ఛేజ్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. బ్యాటర్లకు క్రీజులో కుదురుకునే అవకాశం ఇవ్వకుండా డాట్ బాల్స్ సంఖ్యను పెంచారు. ఈ దశలో పెరిగిన అవసరమైన రన్ రేట్ యువ బ్యాటర్లపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని తెచ్చింది.

45
అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ అవుట్
Image Credit : ICC/x

అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ అవుట్

మ్యాచ్ చివరి దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అర్ష్‌దీప్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రమైన గాయానికి గురయ్యాడు. షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతని ఎడమ చేతి బైసెప్స్‌కు తగలడంతో నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో మైదానానికి వచ్చి చికిత్స అందించినప్పటికీ, అతను కొనసాగలేక రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇది భారత జట్టు విజయాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

55
వెస్టిండీస్ అద్భుతమైన ఫీల్డింగ్, ప్లానింగ్
Image Credit : ANI

వెస్టిండీస్ అద్భుతమైన ఫీల్డింగ్, ప్లానింగ్

వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగింది. కెప్టెన్ షాయ్ హోప్ చక్కని వ్యూహాత్మక మార్పులతో బౌలర్లను సద్వినియం చేసుకున్నాడు. రోవ్‌మన్ పావెల్ లాంటి ఆటగాళ్లు అవుట్‌ఫీల్డ్‌లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకుంటూ భారత బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్లలో ఒత్తిడిని జయించి విండీస్ బౌలర్లు కట్టడి చేయడంతో, భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. అల‌జ‌డి సృష్టించిన హోప్‌, ఇండియా టార్గెట్ ఎంతంటే?
Recommended image2
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image3
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Related Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved