IND vs PAK: వాటే కమ్ బ్యాక్.. బాబర్ ఆజంకు హర్దిక్ షాక్
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్ సమయంలో అద్భుతమైన కమ్ బ్యాక్ తో హార్దిక్ పాండ్యా పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజంకు షాక్ ఇచ్చాడు.

Image Credit: Getty Images
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హై వోల్టేజీ మ్యాచ్ లో ఇండియా vs పాకిస్తాన్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ భారత్‌పై ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ శర్మ సేన ఎలాంటి మార్పులు చేయకుండా బంగ్లాదేశ్ తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి రావడంతో పాకిస్తాన్ ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్ లో షమీ, హర్షిత్ రాణాలు త్వరగా వికెట్లు తీసుకోలేకపోయారు. అయితే, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు టీమిండియాకు బ్రేక్ త్రూ అందించారు.
బాబార్ ఆజంను పెవిలియన్ కు పంపిన హర్దిక్ పాండ్యా
ఈ మ్యాచ్ లో అద్భుతమైన కమ్ బ్యాక్ బౌలింగ్ తో హర్దిక్ పాండ్యా పాక్ ఓపెనర్ బాబార్ ఆజంను ఔట్ చేశాడు. హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఆజం బిగ్ షాట్ ఆడి ఫోర్ కొట్టాడు. అయితే, ఆ తర్వాతి బంతికే హార్దిక్ పాండ్యా బ్రేక్‌త్రూ ఇస్తూ బాబార్ ఆజంను ఔట్ చేశాడు.
బాబర్ అజామ్ స్టంప్స్ వెనుక కేఎల్ రాహుల్‌కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. బిగ్ షాట్ ఆడబోయిన బాబార్ ఆజం బ్యాట్ ను బాల్ ఎడ్జ్ ను తాకడంతో క్యాచ్ గా పెవిలియన్ చేరాడు. బాబార్ ఔట్ అయిన తర్వాత హర్దిక్ పాండ్యా సెలబ్రేట్ చేసుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీంతో పాకిస్తాన్ 8.2 ఓవర్లలో 41/1 పరుగులు చేసింది.
Image Credit: Getty Images
అక్షర్ పటేల్ కొడితే వికెట్ ఎగిరిపడింది ! .
హర్దిక్ పాండ్యా తొలి వికెట్ రూపంలో బాబార్ ఆజంను పెవిలియన్ కు పంపాడు. తర్వాత అక్షర్ పటేల్ అద్భుతమైన త్రో తో మరో ఓపెనర్ ను ఔట్ చేశాడు. మిడ్-ఆన్‌లో అక్షర్ పటేల్ అద్భుతమైన డైరెక్ట్ హిట్ కొట్టడంతో ఇమామ్-ఉల్-హక్ 26 బంతుల్లో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
బంతి మిడ్ ఆన్ వైపు కొట్టిన ఇమామ్ పరుగు కోసం వెళ్లాడు. పరుగు తీసుకునే లోపే అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డింగ్ తో బాల్ ను తీసుకుని వికెట్లను డైరెక్టు హిట్ చేశాడు. దీతో ఇమామ్ క్రీజులోకి రావడానికి డైవ్ చేసినప్పటికీ అప్పటికే బాల్ వికెట్లను తాకింది. దీంతో పాకిస్తాన్ 9.4 ఓవర్లలో 52/2 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, షకీల్ సౌద్ పాక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. 25 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 24 పరుగులు, సౌద్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.
India vs Pakistan
ఇరు జట్లు ఇవే
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI):
ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్