MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Womens ODI World Cup 2025: మహళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?

Womens ODI World Cup 2025: మహళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?

Womens ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 16 2025, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల
Image Credit : Getty

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 30న బెంగళూరులో ఇండియా vs శ్రీలంక మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాక్‌అవుట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇండియా vs పాకిస్థాన్: అక్టోబర్ 5న హై వోల్టేజ్ మ్యాచ్
Image Credit : Getty

ఇండియా vs పాకిస్థాన్: అక్టోబర్ 5న హై వోల్టేజ్ మ్యాచ్

ఇండియా - పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ పోరు అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. భారత ప్రభుత్వం గతంలో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వెళ్లడానికి అనుమతించకపోవడంతో, రెండు బోర్డులు ముందుగా అంగీకరించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాకిస్థాన్ తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలో ఆడనుంది.

37
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ వివరాలు
Image Credit : Getty

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ వివరాలు

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. మ్యాచ్‌లు బెంగళూరు, ఇండోర్, విశాఖపట్నం, గౌహతి, కొలంబోలో జరగనున్నాయి.

47
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: భారత జట్టు షెడ్యూల్
Image Credit : twitter

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: భారత జట్టు షెడ్యూల్

  1.  సెప్టెంబర్ 30: ఇండియా vs శ్రీలంక - బెంగళూరు
  2.  అక్టోబర్ 5: ఇండియా vs పాకిస్థాన్ - కొలంబో
  3.  అక్టోబర్ 9: ఇండియా vs దక్షిణాఫ్రికా - విశాఖపట్నం
  4.  అక్టోబర్ 12: ఇండియా vs ఆస్ట్రేలియా - విశాఖపట్నం
  5.  అక్టోబర్ 19: ఇండియా vs ఇంగ్లాండ్ - ఇండోర్
  6.  అక్టోబర్ 23: ఇండియా vs న్యూజిలాండ్ - గౌహతి
  7.  అక్టోబర్ 26: ఇండియా vs బాంగ్లాదేశ్ - బెంగళూరు
57
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 : నాక్‌అవుట్ మ్యాచ్‌ల వివరాలు
Image Credit : Social Media

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 : నాక్‌అవుట్ మ్యాచ్‌ల వివరాలు

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్స్

  • అక్టోబర్ 29 - గౌహతి లేదా కొలంబో
  • అక్టోబర్ 30 - బెంగళూరు

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్

  • నవంబర్ 2 - బెంగళూరు లేదా కొలంబో
67
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లు
Image Credit : Getty

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లు

  • ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - అక్టోబర్ 22, ఇండోర్
  • న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - అక్టోబర్ 18, కొలంబో
  • ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా - అక్టోబర్ 3, బెంగళూరు
77
మహిళల వన్డే వరల్డ్ కప్
Image Credit : SOCIAL MEDIA

మహిళల వన్డే వరల్డ్ కప్

50 ఓవర్ల మహిళల వరల్డ్ కప్ 2013 ను భారత్‌లోనే నిర్వహించారు. ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాాంపియన్స్ ఆస్ట్రేలియా, ఈసారి కూడా ట్రోఫీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

ICC ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారం, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు మరెన్నో రసవత్తర పోరాటాలు జరగనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
India: కోహ్లీ, సచిన్ లకు సాధ్యం కాలేదు.. లార్డ్స్‌లో మూడు టెస్ట్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత క్రికెటర్ ఎవరు?
Recommended image2
India: 93 ఏళ్లలో కేవలం 9 విజయాలు.. ఇంగ్లాండ్‌లో భారత బ్యాటింగ్‌కు భారీ సవాల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved