ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేసిన కేఎల్ రాహుల్.. 50వ టెస్టులో 100 మిస్ !
India vs England: భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. అయితే, భారత వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్ బ్యాట్ రాణించి తన 50 టెస్టులో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
KL Rahul
India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బాల్ తో రాణించి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసిన భారత్ బ్యాట్ తోనూ రాణిస్తూ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది.
KL Rahul
హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తన టెస్టు కెరీర్ లో మరో మైలు రాయిని అందుకున్నాడు.
KL Rahul
తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 86 పరుగులు చేశాడు. 14 పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 8 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు.
ఈ సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ టెస్టుల్లో నాలుగో స్తానంలో బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. అలాగే, అతనికి ఇది 50 టెస్టు. తన 50వ టెస్టులో హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే, టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రాహుల్‌కు ఇది ఐదో 50 ప్లస్ స్కోరు.
KL Rahul
డిసెంబరు 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
తన 50వ గేమ్‌ను ఆడుతున్న అతను 34.22 సగటుతో టెస్టుల్లో ఎనిమిది సెంచరీలు, 14 అర్ధ సెంచరీల సహాయంతో 2,841 పరుగులు చేశాడు.
హైదరాబాద్ లో సాధించిన ఈ హాఫ్ సెంచరీ తన టెస్టు కెరీర్ లో 14వ అర్ధశతకం కాగా, ఇప్పటివరకు ఏడు సెంచరీలు బాదాడు. అలాగే, కేఎల్ రాహుల్ స్వదేశంలో 42.04 సగటుతో 1,000 పైగా పరుగులు సాధించిన ప్లేయర్ గా కూడా నిలిచాడు.
KL Rahul
స్వదేశంలో ఇంగ్లండ్‌పై 900కు పైగా పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ పై రాహుల్ కు ఇది ఐదవ 50-ప్లస్ స్కోరు. ఈ టీమ్ పై మూడు సెంచరీలు కూడా బాదాడు. ఇంగ్లీష్ జట్టుపై 40.56 సగటుతో 933 పరుగులు చేశాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్ అత్యధిక స్కోర్ 199 పరుగులు కూడా 2016లో ఇంగ్లాండ్ జట్టుపై సాధించడం గమనార్హం.