Gill : వన్డేల్లో ఏడో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ కొత్త రికార్డు
Shubman Gill: ఇంగ్లాండ్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన వన్డే కెరీర్ లో ఏడో సెంచరీ కొట్టి కొత్త రికార్డు సాధించాడు.

Shubman Gill: భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో తన ఏడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అద్భుత మైన ఆటతో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో తన వన్డే కెరీర్ లో 7వ సెంచరీని పూర్తి చేశాడు.
ఇటీవల టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్ మన్ గిల్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో మూడు అంకెల మార్కును అందుకుని వైస్ కెప్టెన్ తానే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
సెంచరీతో శుభ్ మన్ గిల్ మరో రికార్డు
ఈ సెంచరీతో వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. దీంతో పాటు పలు రికార్డులు అందుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఉంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఓవర్ లోనే ఒక పరుగుకే ఔట్ అయ్యాడు.
అయితే, విరాట్ కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. రెండో వికెట్ కు విరాట్ కోహ్లీతో కలిసి గిల్ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
Image Credit: Getty Images
కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు
చాలా కాలం నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తో ఫామ్ ను అందుకున్నాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ (52 పరుగులు) కొట్టాడు. ఆ తర్వాత గిల్ సెంచరీ కొట్టాడు.
శుభ్ మన్ గిల్ కు ఏడో వన్డే సెంచరీ
వైస్ కెప్టెన్ గిల్ అసాధారణ ఫామ్ తో భారత్ కు మరోసారి శుభారంభం అందించాడు. అతను కేవలం 50 వన్డేల్లో ఏడు సెంచరీలు సాధించాడు. అతని ఖాతాలో 15 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 112 పరుగుల తన ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
గిల్ 60+ సగటు వన్డే క్రికెట్‌లో (50+ మ్యాచ్‌లు) ఒక బ్యాట్స్‌మన్‌కు అత్యుత్తమమైనది. ఈ ఫార్మాట్‌లో అతని స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ.
Image Credit: ANI
గిల్ తరపున వన్డేల్లో వరుసగా 50+ స్కోర్లు
మూడు వన్డేల సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొదటి రెండు వన్డేల్లో అతను 87, 60 పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్ లో సెంచరీ (112 పరుగులు) కొట్టాడు.
శుభ్ మన్ గిల్ టీమిండియా తరపున మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో యాభైకి పైగా స్కోర్లు చేసిన ఏడవ ఆటగాడిగా నిలవడంతో పాటు కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ , MS ధోని , శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లతో కూడిన ఎలైట్ లిస్ట్‌లో చేరాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్
గిల్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 2,500వ పరుగులను పూర్తి చేసుకున్నాడు. 50 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ మార్కును అత్యంత వేగంగా చేరుకున్న బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.
తన 53వ ఇన్నింగ్స్‌లో 2,500వ పరుగులు చేసిన దక్షిణాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అలాగే, భారత ప్లేయర్లను గమనిస్తే శ్రేయాస్ అయ్యర్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగించాడు.