MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1

Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1

Team India: జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో గెలిచి భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుందాం. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి మళ్లీ నంబర్-1 స్థానానికి చేరింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 26 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హరారేలో జింబాబ్వే అవుట్.. ఇంగ్లాండ్‌కు ఊహించని షాకిచ్చిన భారత్
Image Credit : X/BCCI

హరారేలో జింబాబ్వే అవుట్.. ఇంగ్లాండ్‌కు ఊహించని షాకిచ్చిన భారత్

హరారే లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జింబాబ్వే జట్టును ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ సూపర్ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. ఇక సిరీస్‌లో మూడో అలాగే ఆఖరి టీ20 మ్యాచ్ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు హరారేలోనే జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంగ్లాండ్‌ను దాటి నంబర్-1 కుర్చీకి టీమిండియా
Image Credit : bcci

ఇంగ్లాండ్‌ను దాటి నంబర్-1 కుర్చీకి టీమిండియా

ఈ గ్రాండ్ విక్టరీతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మళ్లీ టాప్ చైర్ సాధించింది. రీసెంట్‌గా ఇంగ్లాండ్ చేతిలో 0-4 తేడాతో టీ20 సిరీస్ ఓడిపోవడం వల్ల భారత్ తన నంబర్-1 స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు జింబాబ్వేపై సాధించిన ఈ దెబ్బతో ఇంగ్లాండ్‌ను రెండో స్థానానికి నెట్టేసి, మళ్లీ తన కోల్పోయిన టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.

Related Articles

Related image1
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 లో మను భాకర్ ఎందుకు ఆడటం లేదు?
Related image2
Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే
35
ఆరంభంలో షాక్ వచ్చినా నిలదొక్కుకున్న బ్యాటర్లు
Image Credit : X/BCCI

ఆరంభంలో షాక్ వచ్చినా నిలదొక్కుకున్న బ్యాటర్లు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ బోర్డుపై పెట్టింది. అయితే టీమ్ స్టార్టింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో 29 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది.

45
ఇషాన్ కిషన్, తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
Image Credit : ANI

ఇషాన్ కిషన్, తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్

ఆ టైమ్‌లో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 66 పరుగుల ఇంపార్టెంట్ పార్టనర్‌షిప్ నమోదు చేశారు. శ్రేయస్ అయ్యర్ 20 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ కాగా, ఇషాన్ కిషన్ మాస్ మూడ్‌లోకి వెళ్లాడు. ఇషాన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 81 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఫైర్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ సింగ్ 12 పరుగులు జోడించాడు.

55
బౌలింగ్‌లోనూ దుమ్మురేపారు
Image Credit : X/BCCI

బౌలింగ్‌లోనూ దుమ్మురేపారు

220 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టును భారత బౌలర్లు గట్టిగానే దెబ్బకొట్టారు. దాంతో జింబాబ్వే టీమ్ 129 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియన్ బెన్నెట్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, తదీవనాషే మరుమని 24 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో బ్యాటింగ్‌లో రాణించిన అభిషేక్ శర్మ బౌలింగ్‌లోనూ మెరిసి 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. యష్ ఠాకూర్ 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి టీమిండియా భారీ విజయానికి బాటలు వేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 లో మను భాకర్ ఎందుకు ఆడటం లేదు?
Recommended image2
Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved