MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా

IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా

India Beat Zimbabwe: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తుపాన్ హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 23 2026, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మయాంక్ స్పీడ్, వైభవ్ సిక్సర్లు.. తొలి T20I లో జింబాబ్వే ఖేల్ ఖతమ్
Image Credit : X/BCCI

మయాంక్ స్పీడ్, వైభవ్ సిక్సర్లు.. తొలి T20I లో జింబాబ్వే ఖేల్ ఖతమ్

హరారే లో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

జింబాబ్వే విధించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేయడంతో ఛేజింగ్ చాలా ఈజీ అయిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
Image Credit : BCCI/X

చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో వైభవ్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో (15 సంవత్సరాల 118 రోజులు) హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1989లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు) నెలకొల్పిన రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.

Maiden international fifty 👏

Vaibhav Sooryavanshi becomes the youngest batter ever to score a T20I half-century 🫡

Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#TeamIndia | #ZIMvIND pic.twitter.com/aUWiBE9FLz

— BCCI (@BCCI) July 23, 2026

35
మయాంక్ యాదవ్ సంచలన రీఎంట్రీ
Image Credit : X/BCCI

మయాంక్ యాదవ్ సంచలన రీఎంట్రీ

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత ఫాస్ట్ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన పేస్ పవర్‌తో తొలి బంతికే వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. మయాంక్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు ప్రిన్స్ యాదవ్ (2/19), అశోక్ శర్మ కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో వెస్లీ మాధెవెరె (39), మరుమాని (27) కొద్దిగా పోరాడటంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగలిగింది.

Blowing through the top order early on 🔥

Mayank Yadav is awarded the Player of the Match for an outstanding powerplay spell on his comeback 🌟

Scorecard ▶️ https://t.co/NKa0znQQ3H#TeamIndia | #ZIMvIND pic.twitter.com/XPWQWbf47i

— BCCI (@BCCI) July 23, 2026

45
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్లాస్ నాక్
Image Credit : X/BCCI

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్లాస్ నాక్

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ (1) త్వరగానే అవుట్ అయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ అవుటైన తర్వాత ఇషాన్ కిషన్ (35 పరుగులు, 24 బంతుల్లో) వేగంగా పరుగులు సాధించాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ (5 నాటౌట్) సింగిల్ తీసి విజయాన్ని అందించాడు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు 8వ మ్యాచ్ లలో లభించిన తొలి T20I విజయం ఇది కావడం గమనార్హం.

55
ఇండియా vs జింబాబ్వే మ్యాచ్ స్కోర్ బోర్డ్
Image Credit : X/BCCI

ఇండియా vs జింబాబ్వే మ్యాచ్ స్కోర్ బోర్డ్

• జింబాబ్వే: 20 ఓవర్లలో 125/7 (వెస్లీ మాధెవెరె 39, మరుమాని 27; మయాంక్ యాదవ్ 2/18, ప్రిన్స్ యాదవ్ 2/19)

• భారత్: 13.2 ఓవర్లలో 126/3 (వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35, శ్రేయస్ అయ్యర్ 27*; బ్లెస్సింగ్ ముజారబానీ 2/26)

• ఫలితం: 7 వికెట్ల తేడాతో భారత్ విజయం.

India get off to a winning start in the T20I series against Zimbabwe 🙌

📝: https://t.co/QVU1mWJMPt pic.twitter.com/kWKcw9teuH

— ICC (@ICC) July 23, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
Commonwealth Games 2026: గోల్డ్ మెడల్స్ పక్కా.. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో మన బంగారు తల్లులు !
Recommended image2
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved