MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: భారత జట్టు ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే

India vs England: భారత జట్టు ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే

India vs England: హెడ్డింగ్‌లీ టెస్టులో భారత్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫీల్డింగ్ తప్పిదాల నుండి లోయర్ ఆర్డర్ వైఫల్యాల వరకు పలు విషయాల్లో తప్పిదాలతో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 25 2025, 06:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
IND vs ENG : భారత జట్టు ఎందుకు ఓడిపోయింది?
Image Credit : Getty

IND vs ENG : భారత జట్టు ఎందుకు ఓడిపోయింది?

లీడ్స్ లోని హెడ్డింగ్‌లీ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసినప్పటికీ విజయం దక్కలేదు. ఇంగ్లాండ్ బలంగా ఆడినంతగా,  భారత జట్టు ప్రదర్శన కూడా ఉంది. కానీ కొన్ని విషయాల్లో విఫలమవడంతో ఓటమి పాలైంది.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి ఇది తొలి మ్యాచ్ అయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. గెలుపు అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగింది. కానీ, చిన్న చిన్న పొరపాట్లతో భారీ ముల్యం చెల్లించాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
IND vs ENG : చెత్త ఫీల్డింగ్, కీలక క్యాచ్‌లు వదిలేశారు
Image Credit : Getty

IND vs ENG : చెత్త ఫీల్డింగ్, కీలక క్యాచ్‌లు వదిలేశారు

ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ముందున్నది ఫీల్డింగ్ లోపాలు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వదిలిపెట్టిన క్యాచ్ లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. బెన్ డకెట్ తొలి ఇన్నింగ్స్‌లోను, రెండో ఇన్నింగ్స్‌లోను జైస్వాల్ క్యాచ్ లు మిస్ చేశాడు. దీంతో క్రీజులో ఎక్కువ సేపు ఉండి ఇంగ్లాండ్ కు సూపర్ నాక్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద వదిలిన క్యాచ్ తర్వాత డకెట్ మరో 51 పరుగులు చేశాడు.

ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌లను బుమ్రా, రిషబ్ పంత్ లు కూడా వదిలేసారు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు వదిలేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే సంఖ్యలో క్యాచ్‌లు మిస్ చేశారు.

37
IND vs ENG : లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మరీ దారుణం
Image Credit : SOCIAL MEDIA

IND vs ENG : లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మరీ దారుణం

భారత బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్‌లో 430-3 పరుగులతో బలమైన స్థితిలో ఉండి 471 వద్ద ఆలౌటైంది. చివరి 7 వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 

చివరి 6 వికెట్లు కేవలం 31 పరుగులకే పడిపోయాయి. రెండు ఇన్నింగ్స్‌లలో టెయిల్ ఎండ్ ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు. ఒత్తిడి తట్టుకోలేకపోయారు. జోష్ టంగ్ రెండుసార్లు ఈ భాగాన్ని కుప్పకూల్చి, ఇంగ్లాండ్‌ను గేమ్‌లోకి తీసుకురావడంలో కీలకంగా మారాడు.

47
IND vs ENG : భారత జట్టు బౌలింగ్ తేలిపోయింది
Image Credit : Getty

IND vs ENG : భారత జట్టు బౌలింగ్ తేలిపోయింది

భారత స్టార్ బౌలర్లు ఈ మ్యాచ్ చివరిరోజు తమ సామర్థ్యాన్ని చూపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటివారు డకెట్-క్రాలీ భాగస్వామ్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. డకెట్ 149 పరుగులతో ఆడగా, క్రాలీ 65 పరుగులు చేశాడు. మైదానం మారుతున్న సమయంలో బంతికి స్పిన్, బౌన్స్ తగ్గిపోవడం కూడా బౌలర్లకు అనుకూలించలేదు.

తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీసుకుని పర్వాలేదనిపించినా అప్పటికే ఇంగ్లాండ్ బిగ్ స్కోర్ మార్కును దాటింది. మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లలో అయితే, మొత్తంగా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.

57
IND vs ENG : ఓత్తిడిని జయించలేకపోయిన భారత్
Image Credit : social media

IND vs ENG : ఓత్తిడిని జయించలేకపోయిన భారత్

371 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయడం ఓ సవాల్ అయినా, భారత బౌలింగ్ యూనిట్ చివరి రోజు పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. బ్యాటింగ్‌లో సెంచరీలు చేసిన జట్టుకు, విజయం వైపు దూకుడుగా వెళ్లే ఆత్మవిశ్వాసం కనిపించలేదు. 

ఫీల్డింగ్‌లో జరిగిన చిన్నచిన్న తప్పిదాలు మ్యాచ్‌పై ప్రభావం చూపాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో భారత ప్లేయర్లలో ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా బౌలర్లు వికెట్లు పడకపోవడంతో ఇది స్పష్టంగా కనిపించింది. ఇది ఫీల్డింగ్ పై కూడా ప్రభావం చూపించింది.

67
IND vs ENG : ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన.. బెన్ డకెట్ మ్యాచ్ ను మార్చేశాడు
Image Credit : X

IND vs ENG : ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన.. బెన్ డకెట్ మ్యాచ్ ను మార్చేశాడు

ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్బుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులతో అద్భుత సెంచరీ కొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఆయన 62 పరుగులు చేశారు. అతను మ్యాచ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పవచ్చు. జో రూట్ (నాటౌట్ 53), జేమీ స్మిత్ ల సహకారంతో ఇంగ్లాండ్ అసాధారణమైన ఛేజ్‌ను విజయవంతం చేసింది.

77
భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఏమన్నారంటే?
Image Credit : ANI

భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఏమన్నారంటే?

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, "మేము కొన్ని అవకాశాలను మిస్‌ చేసుకున్నాం. క్యాచ్‌లు వదిలాం, లోయర్ ఆర్డర్ నుంచి మద్దతు రాలేదు. అయినా, జట్టు పోరాటం పై గర్వంగా ఉంది. ఇది యువ జట్టు, ఇంకా నేర్చుకుంటోంది" అని అన్నారు. 

కాగా, ఇది టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఫలితాల్లో ఒకటి.. ఎందుకంటే ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం తొలిసారి. అంతేగాక, అదే మ్యాచ్‌లో ఆరు డకౌట్లు నమోదు కావడం కూడా అరుదైన ఘట్టం. భారత్ ఇప్పుడు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. మిగతా టెస్ట్‌లలో గెలుపు సాధించాలంటే, ఫీల్డింగ్, మిడిల్-లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపరచాల్సిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Ben Duckett: లైఫ్ ఇస్తే ఇండియాకు షాకిచ్చాడు.. ఇంగ్లాండ్ హీరో బెన్ డకెట్
Recommended image2
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టులో ప్లేయర్లు ఎందుకు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు కట్టుకున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved