IND vs PAK: అత్యంత వేగంగా 14000 పరుగులు.. సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

Image Credit: Getty Images
India vs Pakistan: ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 14,000 వన్డే పరుగులను అత్యంత వేగంగా అందుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. అలాగే సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
Image Credit: Getty Images
36 ఏళ్ల విరాట్ కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్‌లలోనే 14 వేల పరుగులను పూర్తి చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 14000 పరుగులు పూర్తి చేయడానికి 350 ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్‌లో 15 పరుగులు సాధించినప్పుడు కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
2015లో టెండూల్కర్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 14000 పరుగుల మార్కును అందుకున్న మూడో క్రికెటర్ గా నిలిచాడు. మరో ఆసక్తికరమైన విషయం విరాట్ కోహ్లీ 13,000 నుండి 14,000కి చేరుకోవడానికి కేవలం 10 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. సెప్టెంబర్ 2023లో కొలంబోలో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు, కోహ్లీ తన 13,000వ వన్డే పరుగుల మార్కుకు చేరుకున్నాడు.
Image Credit: Getty Images
కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌లలో 13,000 పరుగులు సాధించాడు. ఈ విషయంలో కూడా సచిన్ ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 13000 పరుగులను పూర్తి చేయడానికి 321 ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు. అంటే టెండూల్కర్ కంటే 44 తక్కువ ఇన్నింగ్స్‌లలో విరాట్ ఈ మైలురాయిని అందుకున్నాడు. గత వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ రికార్డును 765 పరుగులతో బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో, కోహ్లీ తన 50వ వన్డే సెంచరీతో టెండూల్కర్ సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్‌లో టెండూల్కర్ (18,426), కుమార సంగక్కర (14,234) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మూడవ స్థానంలో ఉన్నాడు.
Image Credit: Getty Images
300 వన్డేలు పూర్తి చేయడానికి కోహ్లీ ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాడు. టెండూల్కర్, ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్ , మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ తర్వాత ఈ మార్కును చేరుకున్న ఏడవ భారత ప్లేయర్ గా కోహ్లీ ఘనత సాధించనున్నాడు.
అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్లు వీరే
287 – విరాట్ కోహ్లీ
350 – సచిన్ టెండూల్కర్
378 – కుమార్ సంగక్కర