IND vs PAK: పాకిస్తాన్ పై కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా విధ్వంసం
Champions Trophy IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ లో కొన్ని తప్పిదాలు చేసిన మొత్తంగా భారత బౌలర్లు రాణించడంతో పాక్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హై వోల్టేజీ మ్యాచ్ లో ఇండియా vs పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు రాణించడంతో పాక్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పగలే భారత బౌలర్లు పాక్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్తాన్‌ను 49.4 ఓవర్లలో 241 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ సేన ముందు 242 పరుగుల టార్గెట్ ఉంది. పాకిస్తాన్ తరఫున సౌద్ షకీల్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. అలాగే, మహ్మద్ రిజ్వాన్ 46, ఖుస్దిల్ షా 38, బాబర్ అజామ్ 23 పరుగులు చేశారు.
అదరగొట్టిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్ లో ప్రారంభంలో వికెట్లు తీసుకోవడానికి పేసర్లు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడైతే స్పిన్నర్లు బరిలోకి దిగారో పాకిస్తాన్ కు ఇబ్బందులు పెరిగాయి. పాక్ స్కోర్ బోర్డు నెమ్మదించడంతో పాటు వికెట్లు పడటం మొదలైంది. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. అతను 3 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రభావం చూపకపోయినా.. హార్దిక్ పాండ్యా తనదైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు. అక్షర్ పటేల్ రెండు రనౌట్ లు కూడా చేశాడు. హర్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో 200 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ జట్లు
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI):
ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్