MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Ind Vs Nz: ముంబై టెస్టులో టీమిండియా నెలకొల్పిన రికార్డులివే.. ఆ ఆటగాడిదే అగ్రతాంబూలం..

Ind Vs Nz: ముంబై టెస్టులో టీమిండియా నెలకొల్పిన రికార్డులివే.. ఆ ఆటగాడిదే అగ్రతాంబూలం..

Ind Vs Nz Test Records: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ముంబైలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు ను గెలవడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2021, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ముంబైలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్.. పలు రికార్డులను కూడా నెలకొల్పింది. జట్టుగానే గాక వ్యక్తిగతంగా కూడా మన ఆటగాళ్లు కూడా రికార్డులు సృష్టించారు. అవేంటంటే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

భారత్ కు ఇదే పెద్ద విజయం : టెస్టుల్లో టీమిండియాకు పరుగుల పరంగా భారీ విజయమిదే. ఈ టెస్టులో  విరాట్ సేన 372 పరుగులతేడాతో కివీస్ ను ఓడించింది. అంతకుముందు.. 2015లో ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

39

మూడు ఫార్మాట్లలో 50 విజయాలు : వన్డే, టెస్టు, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా అదరగొట్టే కింగ్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో 50+విజయాలలో భాగమైన  ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. టెస్టులో ఆటగాడిగా (కెప్టెన్ గా 39 విజయాలు)  50 విజయాల్లో భాగస్వామిగా ఉన్న విరాట్.. 153 వన్డేలు, 61 టీ20 మ్యాచులలో భాగమయ్యాడు. 

49

స్వదేశంలో 14వ సిరీస్  గెలుపు : 2013 నుంచి భారత్ లో జరిగిన ఏ టెస్టు సిరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. న్యూజిలాండ్ తో సిరీస్ గెలుపు భారత్ కు వరుసగా 14వ  సిరీస్ విజయం. ఇందులో 11 సిరీస్ లు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడినవే కావడం గమనార్హం. 

59

అశ్విన్ రికార్డులు : ఈ ఏడాది అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య 52 కు చేరింది. టెస్టులలో ఓ క్యాలెండర్ ఇయర్ లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది నాలుగోసారి. ఇంతకుముందు కుంబ్లే, హర్భజన్ లు 3 సార్లు ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో షేన్ వార్న్ (8 సార్లు) అందరికన్నా ముందున్నాడు.

69

అంతేగాక స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ  జాబితాలతో కుంబ్లే (350 వికెట్లు) ముందున్నాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్.. 265 వికెట్లతో మూడో ప్లేస్ లో ఉన్నాడు.

79

స్వదేశంలో 300 వికెట్లు తీసిన బౌలర్లలో కూడా అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. 49 మ్యాచుల్లో అశ్విన్ ఈ ఘనత సాధించగా.. 48 టెస్టులలోనే శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్.. ఈ ఫీట్ రికార్డు చేశాడు. కుంబ్లే 52 టెస్టుల్లో 300 వికెట్లు తీశాడు. 

89

న్యూజిలాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అశ్విన్  రికార్డు నెలకొల్పాడు. రెండు దేశాల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లలో భాగంగా.. కివీస్ కే చెందిన రిచర్డ్ హ్యడ్లీ  65 వికెట్లు తీయగా.. అశ్విన్ 66 వికెట్లతో ఆ రికార్డును చెరిపేశాడు.

99

పరుగుల పరంగా కివీస్ కు ఇదే అత్యంత భారీ ఓటమి.. అంతకుముందు ఆ జట్టు 2007లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో 358 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved