MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Amazon Great Freedom Sale: సగం ధరకే సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా.. బంపర్ ఆఫర్

Amazon Great Freedom Sale: సగం ధరకే సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా.. బంపర్ ఆఫర్

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) పై భారీ తగ్గింపు ప్రకటించారు. రూ. 55,000 తగ్గింపుతో సగం ధరకే మీకు అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ లభిస్తోంది.

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 31 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్ సేల్.. సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై భారీ తగ్గింపు
Image Credit : Samsung website

అమెజాన్ సేల్.. సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై భారీ తగ్గింపు

సామ్సంగ్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలక్సీ ఎస్ 24 అల్ట్రా (Galaxy S24 Ultra) పై భారీ తగ్గింపు ప్రకటించింది.  దాదాపు సగం ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) 2025 నడుస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు. సామ్సంగ్ గెలక్సీ ఎస్ 24 అల్ట్రా రూ. 79,999కి లభిస్తోంది. దీనిపై రూ. 55,000 తగ్గింపు ధరను ప్రకటించారు.

DID YOU
KNOW
?
మూడు వేరియంట్లలో Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్, 12GB RAM + 1TB స్టోరేజ్. అన్ని వేరియంట్లలో ఒకే ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, S Pen ఉంటుంది. అలాగే, టైటానియం గ్రే, బ్లాక్, వయోలెట్, ఎల్లో కలర్లలో లభిస్తోంది.
25
ఎక్స్ఛేంజ్ పై కూడా సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై భారీ తగ్గింపు
Image Credit : Samsung website

ఎక్స్ఛేంజ్ పై కూడా సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై భారీ తగ్గింపు

అలాగే, మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 47,200 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇతర ఆఫర్లు, డిస్కౌంట్లు కలుపుకుని మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను రూ. 75,999 కొనుగోలు చేయవచ్చు. సామ్ సంగ్ ఎస్ 24 అల్ట్రా లాంచ్ అయినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు కావడం విశేషం.

ఈ ఆఫర్ అమెజాన్ ఇండియాలో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంది. జూలై 31 నుండి ప్రారంభమైంది. ఆగస్ట్ 2 నుంచి డెలివరీలు మొదలు కానున్నాయి.

Related Articles

Related image1
Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై రూ. 20 వేల తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్
Related image2
India vs England: చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై గెలుస్తుందా? ఓవల్‌లో భారత్‌ గెలుపు అవకాశాలెంత?
35
సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి
Image Credit : Samsung website

సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా పై ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి

అమెజాన్ ఈ డీల్ తో పాటు మరికొన్ని అదనపు లాభాలు అందిస్తోంది. జీరో కాస్ట్ ఈఎంఐలోకూడా మీరు సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా ను కోనుగోలు చేయవచ్చు.

  • నో-కాస్ట్ ఈఎంఐ నెలకు రూ. 3,860 నుండి ప్రారంభమవుతుంది
  • Amazon Pay ICICI కార్డు ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది
  • బిజినెస్ కొనుగోలుదారులకు GST ఇన్వాయిస్ ప్రయోజనాలు ఉన్నాయి
  • వారంటీ పొడిగింపు, డ్యామేజ్ ప్రొటెక్షన్ ఎంపికలు అదనపు ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి
45
సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా (Galaxy S24 Ultra) ఫీచర్లు
Image Credit : Getty

సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా (Galaxy S24 Ultra) ఫీచర్లు

సామ్సంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. సామ్సంగ్ ఎస్ 24 అల్ట్రా Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది. ఇత‌ర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి..

  • 6.8-inch డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, ఇది 1440 x 3120 పిక్సెల్‌ల రిజల్యూషన్, 19.5:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది
  • 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 10MP, 50MP, 12MP కెమెరా సెటప్ ఉంది
  • 12MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది
  • సామ్ సంగ్ ఎస్ పెన్ సపోర్ట్
  • టైటానియం ఫ్రేమ్
  • 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు
  • గెలక్సీ ఏఐ (Galaxy AI) ఫీచర్లు
  • అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది
55
ఐఫోన్ 16 కంటే సూపర్ డీల్ ఇది
Image Credit : Getty

ఐఫోన్ 16 కంటే సూపర్ డీల్ ఇది

ఈ డీల్ లో టైటానియం గ్రే కలర్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ అందుబాటులో ఉంది. ఇతర రంగుల వేరియంట్లు కూడా ఉన్నాయి. ఒక ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం. రూ. 79,999 ధరకు లభిస్తున్న ఈ సామ్ సంగ్ ఎస్ 24 అల్ట్రా బెస్ట్ కెమెరా (200MP) సెటప్ తో శక్తివంతమైన ప్రాసెసర్ ను కలిగి ఉంది.

అలాగే, సూపీరియర్ బ్యాటరీ లైఫ్, S Pen, ఏఐ వంటి ప్రత్యేకతలతో.. ఐఫోన్ 16 (iPhone 16), ఐఫోన్ 16 ప్లస్ లతో పోలిస్తే మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటుంది. కెమెరా, డిస్‌ప్లే, ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ పరంగా S24 Ultra నాన్ ప్రో ఐఫోన్ 16 మోడళ్ల కంటే బెటర్ గా ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
అమరావతి
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved