ఆస్ట్రేలియా అంటే పూనకాలే.. విరాట్ కోహ్లీ పరుగుల సునామీ !
IND vs AUS: డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్‌లో పింక్ బాల్‌తో భారత్, ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో మ్యాచ్ జరగనుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ అద్భుతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాడు.
IND vs AUS - Virat Kohli: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ని భారత్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు 295 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఇప్పుడు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 6 (శుక్రవారం) నుంచి అడిలైడ్ ఓవల్‌లో పింక్ బాల్ తో జరగనుంది.
Image Credit: Getty Images
అడిలైడ్‌లో విరాట్ కోహ్లీ పరుగుల తుఫాను
అడిలైడ్ టెస్టులో అందరి దృష్టి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే ఆసీస్ పై కోహ్లీకి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. కింగ్ కోహ్లీ మరోసారి ఆస్ట్రేలియాపై తన గడ్డపై ప్రకంపనలు సృష్టించాలనుకుంటున్నాడు. కోహ్లి పెర్త్ టెస్టులో సెంచరీ (100*) సాధించడం ద్వారా ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు.
దీంతో అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో మరింత ఉత్సాహంతో కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. చూస్తుంటే అడిలైడ్ ఓవల్ లో కోహ్లి బ్యాట్ గట్టిగానే మాట్లాడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ కోహ్లీకి అద్భుతమైన బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి.
Image Credit: Getty Images
మరోసారి రఫ్ఫాడించాలనుకుంటున్న కింగ్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఆడిలైడ్ మైదానంలో మొత్తం 11 మ్యాచ్‌లు (4 టెస్టులు, 4 వన్డేలు, 3 టీ20లు) ఆడాడు, ఇందులో మూడు ఫార్మాట్‌లతో సహా అతను 73.61 సగటుతో 957 పరుగులు చేశాడు. అడిలైడ్ ఓవల్‌లో కోహ్లీ ఐదు సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో మూడు సెంచరీలు, వన్డేల్లో రెండు సెంచరీలు సాధించాడు.
డిసెంబరు 2014లో కోహ్లీ ఇదే మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు (115, 141) చేశాడు. కెప్టెన్‌గా కోహ్లికి అదే తొలి టెస్టు మ్యాచ్, ఇందులో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి పాలైనప్పటికీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ తన బ్యాట్ తో మరోసారి విశ్వరూపం చూపించాడు.
Image Credit: Getty Images
ఆస్ట్రేలియా అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే..
అడిలైడ్‌లోనే కాదు... ఆస్ట్రేలియాలోని దాదాపు ప్రతి మైదానంలో విరాట్ కోహ్లి బ్యాట్ అద్భుతంగా పరుగులు రాబడుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు కోహ్లి మొత్తం 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 56.03 సగటుతో 1457 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లి 7 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. డిసెంబరు 2014లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో కోహ్లీ చేసిన 169 పరుగులు ఆస్ట్రేలియాలో అత్యుత్తమ టెస్ట్ స్కోరు.
Image Credit: Getty Images
2014-15 ఆసీస్ పర్యటనలో కోహ్లి సంచలనం
2011-12, 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలలో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి. టెస్టు సిరీస్‌లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఉంది. 2014-15 పర్యటనలో కోహ్లీ నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.
Image Credit: Getty Images
అడిలైడ్ లో మరోసారి దుమ్మురేపుతానంటున్న కోహ్లీ
అడిలైడ్ లో అద్భుతమైన గణాంకాలు కలిగివున్న విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాలనుకుంటున్నాడు.
అడిలైడ్ ఓవల్‌లో కోహ్లీ టెస్టు రికార్డులు
మొత్తం మ్యాచ్‌లు: 4
పరుగులు: 509
సగటు: 63.62
సెంచరీలు: 3
ఫిఫ్టీ: 1
సిక్సర్లు: 2
ఫోర్లు: 53
ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ టెస్టు రికార్డు
మొత్తం మ్యాచ్‌లు: 26
పరుగులు: 2147
సగటు: 48.79
సెంచరీలు: 9
ఫిఫ్టీ: 5
సిక్సర్లు: 7
ఫోర్లు: 235