MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India Vs Australia: భార‌త్-ఆస్ట్రేలియా మూడో టీ20.. జ‌ట్టులోకి శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. !

India Vs Australia: భార‌త్-ఆస్ట్రేలియా మూడో టీ20.. జ‌ట్టులోకి శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. !

IND vs AUS T20 Series: ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగా భార‌త్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీ రేసులో నిలవాలంటే మూడో గేమ్ ను త‌ప్ప‌కుండా గెలవాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కంగారులు.. మూడో టీ20లో ఎలాగైనా గెల‌వాల‌ని చూస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 28 2023, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

IND vs AUS, 3rd T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మంగళవారం గౌహతిలో జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండింటిలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఐదు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ల పోరులో భారత్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.
 

38

ఈ సిరీస్ లోని తొలి గేమ్‌తో పోలిస్తే 2వ మ్యాచ్‌లో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. రెండో గేమ్‌లో ఆస్ట్రేలియా బౌండరీ శాతాన్ని త‌గ్గించారు. అయితే, గ‌త రెండు మ్యాచ్ ల‌తో పోలిస్తే.. కంగారులు మూడో టీ20లో పుంజుకునే అవకాశ‌ముంది. 
 

48

ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్ మంగళవారం (నవంబర్ 28) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించి భారత్ ట్రోఫీని కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తోంది. 
 

58

శ్రేయాస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి రానున్నాడు. వైస్ కెప్టెన్‌గా, అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో నేరుగా స్థానం పొంద‌నున్నాడు. ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ను త‌ప్పించే అవ‌కాశ‌ముంది. 

68

శ్రేయాస్ అయ్యర్ రాక త‌ర్వాత భార‌త జ‌ట్టు గ‌మ‌నిస్తే.. రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికె), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, పర్దీష్ కృష్ణల‌తో మూడో టీ20లో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. 
 

78

అయితే, మూడో మ్యాచ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ కు కాకుండా టీమిండియా కమాండ్‌ని శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించవచ్చనే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

88

బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా మూడో టీ20లోకి అడుగుపెడతాడు, అయితే సూర్య జట్టులో లేకుంటే, సీనియర్ అయినందున శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వవచ్చు. అయ్యర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇదివ‌ర‌కు సార‌థ్యంలో వ‌హించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
రోహిత్ శర్మ
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved