MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్

IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్

Shubman Gill breaks Rohit Sharma record : ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన గిల్ నంబర్-1 స్థానానికి చేరుకున్నాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 07 2026, 07:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IND vs AFG: రోహిత్‌ను దాటేసిన శుభ్‌మన్ గిల్.. కెప్టెన్‌గా సెంచరీతో నయా రికార్డు
Image Credit : X/BCC

IND vs AFG: రోహిత్‌ను దాటేసిన శుభ్‌మన్ గిల్.. కెప్టెన్‌గా సెంచరీతో నయా రికార్డు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మొదటి రోజే అదరగొట్టింది. మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటర్లు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ బాదడమే కాకుండా, ఒక భారీ రికార్డును సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసి చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోహిత్‌ను దాటేసి నంబర్-1గా నిలిచిన గిల్
Image Credit : X/BCC

రోహిత్‌ను దాటేసి నంబర్-1గా నిలిచిన గిల్

ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో శుభ్‌మన్ గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గిల్ ఇప్పటివరకు 40 డబ్ల్యూటీసీ మ్యాచ్‌ల్లో 73 ఇన్నింగ్స్‌లు ఆడి 10 సెంచరీలు పూర్తి చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతకుముందు ఈ రికార్డులో రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ సమానంగా ఉండేవారు. కానీ ఇప్పుడు రోహిత్‌ను వెనక్కి నెట్టి గిల్ నంబర్-1 స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం గిల్ 103 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. కెప్టెన్‌గా గిల్ ఆడిన గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఇది 6వ సెంచరీ కావడం విశేషం. గిల్ తర్వాతి టార్గెట్ వరల్డ్ రికార్డుపైనే ఉంది. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీల లిస్ట్‌లో గిల్ ఇప్పుడు ప్రపంచంలోనే 6వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మార్నస్ లాబుషేన్, ట్రావిస్ హెడ్, కేన్ విలియమ్సన్ 11 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. గిల్ త్వరలోనే వీరిని కూడా దాటేసే అవకాశం ఉంది.

36
1,000 టెస్ట్ పరుగుల మైలురాయి
Image Credit : X/BCC

1,000 టెస్ట్ పరుగుల మైలురాయి

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో 1,000 పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ ఘనత సాధించిన 11వ భారతీయ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ ఈ ల్యాండ్‌మార్క్‌ను రీచ్ అయ్యాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న కెప్టెన్లలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్‌లు) తర్వాత గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. 

అయితే, రోజుల పరంగా చూస్తే కేవలం 351 రోజుల్లోనే ఈ ఘనత సాధించి, అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. భారత్ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లీ (20) టాప్‌లో ఉండగా.. సునీల్ గావస్కర్ (11), మహ్మద్ అజారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గిల్ ఇప్పుడు 6 సెంచరీలతో వీరి సరసన చేరాడు.

46
రాహుల్ క్లాస్ సెంచరీ.. ఓపెనర్ల రికార్డు
Image Credit : X/BCC

రాహుల్ క్లాస్ సెంచరీ.. ఓపెనర్ల రికార్డు

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 164 బంతుల్లో తన 12వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ చేసిన తర్వాతి బంతికే 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. భారత ఓపెనర్ల రికార్డులను పరిశీలిస్తే.. సునీల్ గావస్కర్ 33 సెంచరీలతో టాప్‌లో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ 22 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

మురళీ విజయ్ 12 సెంచరీలు చేయగా, కేఎల్ రాహుల్ ఇప్పుడు 11 సెంచరీలతో వారి వెనుక ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఫ్లాప్ అయిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 24 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి 81 పరుగులు చేశాడు. మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

56
రిషభ్ పంత్ 50వ టెస్ట్ రికార్డు
Image Credit : ANI

రిషభ్ పంత్ 50వ టెస్ట్ రికార్డు

భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఇది 50వ టెస్ట్ మ్యాచ్. భారత వికెట్ కీపర్లలో ఎంఎస్ ధోని (90), సయ్యద్ కిర్మాణి (88) మాత్రమే పంత్ కంటే ఎక్కువ టెస్టులు ఆడారు. పంత్ తన 50వ టెస్టును సూపర్ హాఫ్ సెంచరీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. కేవలం 50* పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పంత్, తన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. మ్యాచ్ చివరి ఓవర్లో పంత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్, పంత్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

66
మొదటి రోజు మ్యాచ్ సమ్మరీ
Image Credit : X/BCC

మొదటి రోజు మ్యాచ్ సమ్మరీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత రాహుల్, సాయి సుదర్శన్ కలిసి లంచ్ సమయానికి స్కోరును 96/1 కి చేర్చారు. సెకండ్ సెషన్‌లో రాహుల్, గిల్ కలిసి 113 పరుగులు జోడించి స్కోరును 209/2 కి తీసుకెళ్లారు. సాయి సుదర్శన్ (81), కేఎల్ రాహుల్ (100) అవుట్ అయినప్పటికీ, గిల్ (103*), పంత్ (50*) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ 85 ఓవర్లలో 368/3 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ రెండు వికెట్లు తీయగా, జియావుర్ రెహమాన్ షరీఫీ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది.

భారత్: 85 ఓవర్లలో 368/3 (శుభ్‌మన్ గిల్ 103*, కేఎల్ రాహుల్ 100, సాయి సుదర్శన్ 81, రిషభ్ పంత్ 50*

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
India vs Afghanistan : పసికూనతో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. గిల్ సేనకు అసలైన అగ్నిపరీక్ష
Recommended image2
Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved