MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND v AFG: సెంచ‌రీ కొట్ట‌డం ఖాయం.. స‌రికొత్త రికార్డు సృష్టించ‌నున్న రోహిత్ శ‌ర్మ

IND v AFG: సెంచ‌రీ కొట్ట‌డం ఖాయం.. స‌రికొత్త రికార్డు సృష్టించ‌నున్న రోహిత్ శ‌ర్మ

India Afghanistan T20 Series: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య మొహాలీ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 427 రోజుల విరామం త‌ర్వాత టీ20 ఆడ‌బోతున్న రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్ లో  స‌రికొత్త రికార్డు సృష్టించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 11 2024, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma

Rohit Sharma

IND vs AFG 1st T20I: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీనికి మొహాలీ వేదిక కానుంది. అఫ్గానిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే అంత‌టా ఆస‌క్తి నెల‌కొంది. గతంలో టీమిండియా టీ20 జ‌ట్టుకు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వేర్వేరు గాయాల కారణంగా అందుబాటులో లేక‌పోవ‌డంతో రోహిత్ శ‌ర్మ జ‌ట్టును న‌డిపిస్తున్నాడు. ఇక ఐర్లాండ్ టీ20ల్లో భారత్ కు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రాకు స్వదేశంలో ఇంగ్లండ్ తో జరగ‌బోయే ఐదు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ కు ముందు విశ్రాంతినిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Rohit Sharma

Rohit Sharma

అయితే, భార‌త్-ఆఫ్ఘన్ సిరీస్ లో రోహిత్ శ‌ర్మ మ‌రో అంత‌ర్జాతీయ రికార్డును సృష్టించ‌బోతున్నాడు. రోహిత్ రికార్డు విషయానికొస్తే అతని కెప్టెన్సీతో సంబంధం లేదుకానీ, పొట్టి ఫార్మాట్లో భారత్ సాధించిన 99 విజయాల్లో భాగస్వామ్యం వహించిన ఈ 36 ఏళ్ల స్టార్ ప్లేయ‌ర్ ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

35

రోహిత్ శ‌ర్మ త‌ర్వాత‌, పాకిస్థాన్ తరఫున 86 విజయాల్లో భాగ‌మైన షోయబ్ మాలిక్ రెండో స్థానంలో నిలిచాడు. జనవరి 11న (గురువారం) మొహాలీలో జరిగే తొలి టీ20లో అఫ్గానిస్థాన్ పై భారత్ విజయం సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఒక జట్టుకు 100 విజయాలు అందించిన తొలి ఆటగాడిగా రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు సృష్టిస్తాడు.

45
തലപ്പത്ത് ഹിറ്റ്മാന്‍

തലപ്പത്ത് ഹിറ്റ്മാന്‍

ఇప్పటివరకు 99 విజయాల్లో 3039 పరుగులు చేసిన అతను 37.98 సగటుతో, 142.60 స్ట్రైక్ రేట్ తో మూడు సెంచ‌రీలు, 25 అర్ధసెంచరీలు భార‌త్ జ‌ట్టు గెలిచిన  మ్యాచ్ ల‌లో సాధించాడు. త‌న రికార్డును మ‌రోసారి బ‌ద్ద‌లు కొట్ట‌నున్నాడు. రికార్డు స్థాయిలో 100వ సారి భార‌త విజ‌యంలో పాలుపొంచుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. 

 

55
Rohit Sharma

Rohit Sharma

అలాగే, టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల లిస్టులో చేర‌డానికి ద‌గ్గ‌ర‌లో  రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 140 ఇన్నింగ్స్ ల‌లో 31.3 సగటుతో 3853 పరుగులు చేయ‌గా,  139.2 స్ట్రైక్ రేట్ తో నాలుగు సెంచరీలు, 29 అర్ధసెంచరీల సాధించాడు. టీ20ల్లో 4 వేల ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ క్లబ్ లో చేరాలంటే రోహిత్ శ‌ర్మ ఇంకా 147 పరుగులు చేయాల్సి ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved