MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SL: ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. ఫాస్ట్ బౌలర్ విధ్వంసానికి గౌతమ్ గంభీర్ షాక్

IND vs SL: ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. ఫాస్ట్ బౌలర్ విధ్వంసానికి గౌతమ్ గంభీర్ షాక్

India vs Sri Lanka: శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో 4 సిక్సర్లతో దుమ్మురేపాడు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్ అవుతోంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 09 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బౌండరీల వర్షం కురిపించిన పడిక్కల్.. మూడో స్థానానికి బెర్త్ కన్ఫర్మ్
Image Credit : X/BCCI

బౌండరీల వర్షం కురిపించిన పడిక్కల్.. మూడో స్థానానికి బెర్త్ కన్ఫర్మ్

శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్‌లో శ్రీలంక క్రికెట్ ఎలవెన్ (SLC XI)తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో మన బ్యాటర్లు దుమ్మురేపారు. రెండో రోజు ఆటలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పవర్ ఏంటో చూపించారు. ఓవైపు దేవ్ దత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో మెరిస్తే, మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అందరి దృష్టిని మాత్రం ఆఖర్లో వచ్చిన ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆకర్షించాడు. ఆ సిక్సర్ల వర్షం చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఫిదా అయిపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. గంభీర్ రియాక్షన్ వైరల్
Image Credit : Instagram/gurnoorsbrar

ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. గంభీర్ రియాక్షన్ వైరల్

ఈ మ్యాచ్‌లో అసలైన మజా ఆఖరి ఓవర్లోనే కనిపించింది. శ్రీలంక స్పిన్నర్ దిలుమ్ సుదీరా వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికి పడిక్కల్ సింగిల్ తీసి గుర్నూర్ బ్రార్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత బరార్ మామూలు రచ్చ చేయలేదు. రెండో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ట్రై చేసినా రన్ రాలేదు.

కానీ ఐదో బంతిని మళ్లీ మిడ్‌వికెట్ స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇక చివరి బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్‌గా మలచడంతో ఆ ఓవర్లో ఏకంగా 25 రన్స్ వచ్చాయి. గుర్నూర్ బ్రార్ బ్యాటింగ్ విన్యాసాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యపోయి చప్పట్లు కొడుతూ అభినందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గుర్నూర్ బ్రార్ కేవలం 18 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

2nd day last over 

4 six by GURNOOR BRAR in An Over

Dream For Zimbu & Bhikari fans😝 #INDvsSL #CricketIndia #TestCricket #GurnootBrar #TeamIndia pic.twitter.com/DPm0wsJlcN

— Kaushy (@kaushyy14) August 8, 2026

35
సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్
Image Credit : X/BCC

సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్

రెండో రోజు ఆటలో టీమిండియా 90 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దేవ్ దత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. గాయం కారణంగా యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో నంబర్-3 స్థానం ఖాళీ అయింది. ఈ అవకాశాన్ని పడిక్కల్ చక్కగా ఉపయోగించుకున్నాడు.

వికెట్ చుట్టూ అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, కట్ షాట్లతో అలరించాడు. కేవలం 121 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తం 142 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 ఫోర్లు బాదాడు. పడిక్కల్ ఆడిన తీరు చూస్తుంటే తొలి టెస్టు తుది జట్టులో నంబర్-3 పొజిషన్ అతడికే దక్కేలా కనిపిస్తోంది.

45
జడేజా, సుథార్ విలువైన ఇన్నింగ్స్
Image Credit : X/BCCI

జడేజా, సుథార్ విలువైన ఇన్నింగ్స్

ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఆట ప్రారంభంలోనే అవుట్ అయినప్పటికీ, కేఎల్ రాహుల్ (40)తో కలిసి పడిక్కల్ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. అనంతరం అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. జడేజా 63 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెళ్లాడు. అలాగే తన తొలి విదేశీ టూర్‌లో ఉన్న మానవ్ సుథార్ (41 రన్స్) కూడా ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాతో కలిసి సుథార్ 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును మరింత పెంచాడు. సారాంశ జైన్ (22 రన్స్) కూడా రిటైర్డ్ అవుట్ అయ్యాడు.

55
నిరాశపరిచిన రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్
Image Credit : X/BCCI

నిరాశపరిచిన రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్

బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై సీనియర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ దారుణంగా విఫలమయ్యారు. పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆఫ్‌స్పిన్నర్ రమేష్ మెండిస్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు.

మరోవైపు ధ్రువ్ జురెల్ కూడా ఆఫ్‌స్పిన్ ఎదుర్కోవడంలో ఉన్న తన బ్యాటింగ్ లోపాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. అతడు కేవలం 1 పరుగు మాత్రమే చేసి మెండిస్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శ్రీలంక స్పిన్ పరిస్థితుల్లో వీరిద్దరూ ఇలా విఫలం కావడం జట్టు యాజమాన్యానికి కాస్త ఆందోళన కలిగించే విషయమే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Recommended image2
ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 15 ప్రో: అప్‌గ్రేడ్ చేయడం వర్త్ ఏనా? ఫీచర్లు, కెమెరా, ధర వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved