MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించింది అందుకే... రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ వైరల్

ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించింది అందుకే... రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ వైరల్

Ishan Kishan: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కు ఇషాన్ కిష‌న్ ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇషాన్ కిష‌న్ ను జ‌ట్టు నుంచి తొల‌గించ‌డంపై అనేక ఊహాగ‌నాలు వినిపిస్తున్న త‌రుణంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 11 2024, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
rahul dravid ishan kishan

rahul dravid ishan kishan

Team India - Ishan Kishan:యంగ్ ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ ను భార‌త జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంపై అనేక ఊహాగ‌నాలు, సంచ‌ల‌న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న త‌రుణంలో టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు విశ్రాంతి కోరుతూ జట్టును వీడిన కిషన్ ఆ తర్వాత దుబాయ్ లో తన సోదరుడి బర్త్ డే పార్టీకి హాజరై ఓ టీవీ గేమ్ షోలో పాల్గొన్నాడనీ, ఇది సెలక్టర్లకు ఆగ్రహం తెప్పించిందని వార్తలు వచ్చాయి. ఈ కార‌ణంగానే టీమ్ నుంచి త‌ప్పించార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌డంపై బీసీసీఐ వ‌ర్గాలు కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు. దీంతో హాట్ టాపిక్ అయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
Ishan Kishan

Ishan Kishan

దక్షిణాఫ్రికాతో టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ టెస్టు సిరీస్ కు ముందు తప్పుకోవడంతో సెలెక్టర్లు కేఎస్ భరత్ ను రెండో వికెట్ కీపర్ గా దక్షిణాఫ్రికాకు పంపారు. వీటన్నింటిపై అసంతృప్తిగా ఉన్నారా? అందుకే అఫ్గానిస్థాన్ సిరీస్ కు ఇషాన్ కిష‌న్ ను జట్టు నుంచి తప్పించారా అని ద్రవిడ్ను ప్రశ్నించగా.. వార్తలను తోసిపుచ్చిన ద్రవిడ్ విశ్రాంతి తీసుకోవడానికి ఇషాన్ కిషన్ జట్టును వీడినట్లు తెలిపాడు. తాను రీ సెలక్షన్ కు సిద్ధంగా ఉన్నానని ఇషాన్ కిషన్ ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫామ్, ఫిట్నెస్ ను నిరూపించుకోవడం ద్వారా కిషన్ తిరిగి జట్టులోకి రావచ్చని ద్రవిడ్ అన్నాడు.

34

గత జూన్ లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ కోసం భారత జట్టులో సభ్యుడైన ఇషాన్ కిషన్, ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్ ల‌ తర్వాత సూపర్ ఫోర్ రౌండ్ లో  కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావ‌డంతో ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం కోల్పోయాడు. డెంగ్యూ జ్వరం కారణంగా శుభ్ మ‌న్ గిల్ తొలి రెండు మ్యాచ్ ల‌లో ఆడలేకపోవడంతోనే ఇషాన్ కిష‌న్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం లభించింది. 

 

44

ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో మూడు మ్యాచ్ ల‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం దక్కలేదు. వరుస తప్పిదాలతో విసిగిపోయిన కిషన్ విశ్రాంతి కోరుతూ జట్టును వీడినట్లు సంకేతాలు వచ్చాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL హిస్టరీలో ఎక్కువ సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన టాప్ 5 ప్లేయర్స్ వీరే
Recommended image2
Virat Kohli : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ డైట్, ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved