ICC Rankings: విరాట్ కోహ్లీకి గుడ్ న్యూస్.. రోహిత్ శర్మకు బ్యాడ్ న్యూస్..
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ టాప్-10 లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రాణించడంతో చాలా రోజుల తర్వాత తిరిగి టాప్-10 లో చోటుదక్కించుకున్నాడు.
ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఆరు సెంచరీలు చేసిన విరాట్, మరో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు..
Virat Kohli - Rohit Sharma: ప్రపంచంలోనే స్టార్ బ్యాట్స్ మెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగినప్పుడల్లా అభిమానులు అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు (భారత్ vs సౌతాఫ్రికా రెండో టెస్టు) ఆడుతున్నాడు. ఇదిలా వుండగా, విరాట్ కోహ్లీకి ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మరోసారి విరాట్ కోహ్లీ సత్తా చాటాడు.
మళ్లీ టాప్-10లోకి విరాట్ కోహ్లీ..
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో మంచి ప్రదర్శన చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నాలుగు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. 2022లో టాప్-10 నుంచి చోటుకోల్పోయిన విరాట్ కోహ్లీ.. గత వారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 38, 76 పరుగులు చేసి పుంజుకున్నాడు.
Image credit: PTI
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాకింగ్స్ న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. విలియమ్సన్, కోహ్లీల మధ్య 103 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. ఆ తర్వాత జో రూట్, స్టీవ్ స్మిత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. విలియమ్సన్ కు 864 రేటింగ్ పాయింట్లు, స్మిత్ కు 859 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 761 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.
14వ స్థానానికి పడిపోయిన రోహిత్ శర్మ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ర్యాకింగ్స్ లో 14వ స్థానానికి పడిపోయాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి తర్వాత రాణించలేకపోవడంతో రోహిత్ ర్యాకింగ్స్ లో డౌన్ అయ్యాడు. ఇక మరో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ 11 స్థానాలు ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 101, 4 పరుగులు చేశాడు.
Ashwin
టెస్టుల్లో నెంబర్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్
ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ రెండో స్థానంలో, శార్దూల్ ఠాకూర్ 34వ స్థానానికి పడిపోయారు. ఓవరాల్ టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి.