MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?

ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?

ODI World Cup 2027: 2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. అక్టోబర్ 10న జోహాన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్తాన్ పోరు జరగనుంది. నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 01 2026, 11:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.. వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది
Image Credit : stockPhoto

క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.. వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ గురువారం అధికారికంగా విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ 2న ప్రారంభమై, నవంబర్ 21న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ముగుస్తుంది.

మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక క్రికెట్ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహాన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
14 జట్లు.. కొత్త ఫార్మాట్.. అక్టోబర్ 2 నుంచి సూపర్ సిరీస్
Image Credit : ICC

14 జట్లు.. కొత్త ఫార్మాట్.. అక్టోబర్ 2 నుంచి సూపర్ సిరీస్

ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పోటీపడనున్నాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా, సెప్టెంబర్ 30, 2026 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న జట్లు నేరుగా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రౌండ్ జరుగుతుంది. క్వాలిఫైయర్‌లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా గ్రూప్ స్టేజ్‌కు చేరుకుంటుంది.

మిగిలిన మూడు జట్లు నమీబియాలోని విండ్‌హోక్ లో అక్టోబర్ 2, 4, 6 తేదీల్లో జరిగే 'సూపర్ సిరీస్'లో తలపడతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగే ఈ సిరీస్‌‌లో టాప్ పాయింట్లు సాధించిన జట్టు గ్రూప్ స్టేజ్‌లో 12వ జట్టుగా ఎంటర్ అవుతుంది.

36
గ్రూప్ ఏ లో భారత్.. లీగ్ స్టేజ్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే
Image Credit : social media

గ్రూప్ ఏ లో భారత్.. లీగ్ స్టేజ్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే

గ్రూప్ స్టేజ్‌లో 12 జట్లను ఆరేసి చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు.

• గ్రూప్ ఏ: భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, క్వాలిఫైయర్ ఏ టీమ్

• గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, క్వాలిఫైయర్ బీ టీమ్

భారత జట్టు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:

1. అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా (కేప్‌టౌన్)

2. అక్టోబర్ 10: భారత్ vs పాకిస్తాన్ (జోహాన్నెస్‌బర్గ్)

3. అక్టోబర్ 14: భారత్ vs అఫ్గానిస్తాన్

4. అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫైయర్ ఏ (బ్లోమ్‌ఫోంటెన్)

5. అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)

విక్టోరియా ఫాల్స్‌లోని కొత్త స్టేడియంలో భారత్, జింబాబ్వేల మధ్య జరిగే మ్యాచ్ గ్రూప్ స్టేజ్‌కు చివరి మ్యాచ్ కానుంది.

46
కొత్తగా 'సూపర్ 7' స్టేజ్.. పాయింట్లు సున్నా నుంచే స్టార్ట్
Image Credit : chat GPT

కొత్తగా 'సూపర్ 7' స్టేజ్.. పాయింట్లు సున్నా నుంచే స్టార్ట్

ఈసారి ఐసీసీ కొత్త ఫార్మాట్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్ స్టేజ్ ముగిసాక టాప్ జట్లు 'సూపర్ 7' స్టేజ్‌కి వెళ్తాయి. రెండు గ్రూపుల్లోని టాప్ 3 జట్లతో పాటు, నాలుగో స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్లు ఉన్న ఒక జట్టు సూపర్ 7కి అర్హత సాధిస్తాయి.

సూపర్ 7 స్టేజ్‌‌లో గ్రూప్ స్టేజ్ పాయింట్లు ఏవీ కలపరు. అన్ని జట్లు సున్నా పాయింట్లతోనే రీస్టార్ట్ చేస్తాయి. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరిగే ఈ స్టేజ్‌లో ప్రతి జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. అభిమానులకు ముందస్తు ప్లానింగ్ సులభం చేయడం కోసం ఐసీసీ ముందే కొన్ని ప్రధాన జట్లకు సూపర్ 7 సీడింగ్ (A1-భారత్, A2-ఆస్ట్రేలియా, A3-పాకిస్తాన్, AB4-ఇంగ్లాండ్, B1-న్యూజిలాండ్, B2-దక్షిణాఫ్రికా, B3-శ్రీలంక) కేటాయించింది.

56
నవంబర్ 17, 18న సెమీస్.. నవంబర్ 21న గ్రాండ్ ఫైనల్
Image Credit : chat GPT

నవంబర్ 17, 18న సెమీస్.. నవంబర్ 21న గ్రాండ్ ఫైనల్

సూపర్ 7 స్టేజ్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌‌కు చేరుకుంటాయి.

• మొదటి సెమీఫైనల్: నవంబర్ 17 (కేప్‌టౌన్)

• రెండో సెమీఫైనల్: నవంబర్ 18

• ఫైనల్ మ్యాచ్: నవంబర్ 21 (జోహాన్నెస్‌బర్గ్)

రెండు సెమీఫైనల్స్‌కు నవంబర్ 19న, అలాగే ఫైనల్ మ్యాచ్‌కి నవంబర్ 22న రిజర్వ్ డేలను కేటాయించారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోతే రిజర్వ్ డేలో పూర్తి చేస్తారు.

66
టికెట్ బుకింగ్స్ ఓపెన్.. హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు
Image Credit : chat GPT

టికెట్ బుకింగ్స్ ఓపెన్.. హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు

టోర్నీకి సరిగ్గా ఏడాది ముందు షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు టికెట్ బ్యాలెట్ ప్రాసెస్ కూడా ప్రారంభించినట్లు ఐసీసీ వెల్లడించింది. టికెట్ ధరలు ఎంట్రీ లెవెల్‌కి USD $9.62 నుంచి హై-టైర్ మ్యాచ్‌లకు USD $31.31 వరకు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ, "షెడ్యూల్ ప్రకటన, టికెట్ బ్యాలెట్ ప్రారంభం అనేది ఈ మెగా టోర్నీ ప్రిపరేషన్స్‌లో కీలక మైలురాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు క్రికెట్ ప్రపంచానికి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే క్రికెట్ లవర్స్ కు సరసమైన ధరల్లో టికెట్లు అందుబాటులో ఉంచాం" అని తెలిపారు. మొత్తం 12 గ్రౌండ్ లలో ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

𝙈𝘼𝙍𝙆 𝙔𝙊𝙐𝙍 𝘾𝘼𝙇𝙀𝙉𝘿𝘼𝙍𝙎 🗓️

The ICC Men’s #CWC27 fixtures have been unveiled 🏆

Access the ticket ballot 🎫 https://t.co/MSLEQzcObb pic.twitter.com/dpTE4TEjO7

— ICC (@ICC) October 1, 2026


The #CWC27 groups are locked ⚡🔐

A cricketing extravaganza awaits! How to watch the schedule launch ➡️ https://t.co/Eod5GoN7zW pic.twitter.com/oVg7zVHLNF

— ICC (@ICC) October 1, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అభిమానుల‌కు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్‌.. అయినా అసంతృప్తిగా ఉంద‌న్న గంభీర్‌
Recommended image2
Asian Games 2026: ఇషాన్ కిషన్ సునామీ బ్యాటింగ్, బుమ్రా మ్యాజిక్.. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్
Recommended image3
Shubman Gill Net Worth: శుభ్‌మన్ గిల్ నెట్ వర్త్ ఎంత? లగ్జరీ లైఫ్‌స్టైల్, కార్ల కలెక్షన్ తెలిస్తే మైండ్ బ్లాక్
Related Stories
Recommended image1
Indian ODI Double Centuries: వన్డేల్లో 8 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు
Recommended image2
Fastest Double Centuries: వన్డేల్లో టాప్ 5 ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలు ఇవే.. గిల్ దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved