MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీని ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఇండియా-పాక్‌ మ్యాచ్‌ ఏ తేదీన ఉంది..

Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీని ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఇండియా-పాక్‌ మ్యాచ్‌ ఏ తేదీన ఉంది..

క్రికెట్ అభిమానుంలతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న క్షణానికి ఇంకా మూడు రోజులే ఉంది. మినీ వరల్డ్‌ కప్‌గా చెప్పుకునే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి జరగనున్న ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి.? మ్యాచ్‌ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు.? లాంటి పూర్తి వివరాలు..  

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 16 2025, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ప్రపంచంలోని టాప్‌ 8 జట్ల మధ్య జరిగే పోరును వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన మొదలై మార్చి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీకి హోస్ట్‌గా పాకిస్థాన్‌ వ్యవహరిస్తోంది. అయతే భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో ఆడకూడదని నిర్ణయించకుంది. ఇందులో భాగంగానే ఈ టోర్నీ పాక్‌తో పాటు దుబాయ్‌ వేదికగా హైబ్రిడ్‌ విధానంలో జరగనుంది. ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్‌-న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. 
 

23

ఎక్కడ చూడొచ్చు.? 

ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను ఈ సారి భారత్‌లో జియో, హాట్ స్టార్ నెట్​వర్క్ ప్రసారం చేయనున్నాయి. ఇందులో భాగంగానే టీవీల్లో స్టార్‌ స్పోరట్స్‌, స్పోర్ట్స్‌ 18 ఛానెల్స్‌లో ప్రసారం కానున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్‌ పురి, తమిళం, కన్నడ వంటి 8 భాషల్లో ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో లైవ్ మ్యాచ్​లు వీక్షించవచ్చు. ఇక డిజిటల్‌ స్ట్రీమింగ్ విషయానికొస్తే జియోస్టార్‌లో వీక్షించవచ్చు. 

ఉచితంగా చూసే అవకాశం లేదు. 

ఛాంపియన్స్‌ ట్రోఫీని జియోస్టార్‌లో వీక్షించవచ్చు. గతంలో జియో టీవీలో ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం జియో, హాట్‌స్టార్‌ రెండూ కలిసి జియోస్టార్‌గా మారిన నేపథ్యంలో ఇప్పుడు కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టీవీలో మాత్రమే మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. ఫోన్‌లో చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. 
 

33
Image Credit: Getty Images

Image Credit: Getty Images

కీలక మ్యాచ్‌లు.

కరాచీ: ప్రారంభ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.

లాహోర్: రెండవ సెమీ-ఫైనల్, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. (ఫైనల్ మ్యాచ్‌ వేదిక మారొచ్చు)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

ఫిబ్రవరి 19: పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్

ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ

ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్

ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్

ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి

ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్

ఫిబ్రవరి 27: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి

ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్

మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ

మార్చి 2: న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్

మార్చి 4: సెమీఫైనల్ 1, దుబాయ్

మార్చి 5: సెమీఫైనల్ 2, లాహోర్

మార్చి 9: ఫైనల్, లాహోర్ (భారత్‌ ఫైనల్‌కు వస్తే మ్యాచ్‌ దుబాయ్‌లో జరుగుతుంది)

మార్చి 10: రిజర్వ్ డే

అన్ని మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లుగా ఉంటాయి.
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. టీ20 వరల్డ్ కప్‌లో అసలేం జరుగుతోంది?
Recommended image2
PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్
Recommended image3
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved