Champions Trophy: సమరానికి సై.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. భారత్ తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడనుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ ఐసీసీ మెగా టోర్నీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma
Champions Trophy 2025: మిని వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. బీసీసీఐ, ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య తీవ్ర ఉత్కంఠను పెంచిన ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్, పాకిస్తాన్ సహా మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. పాకిస్తాన్, యూఏఈ రెండు దేశాల్లో వేదికలు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని కరాచీ, రావల్పిండి, లాహోర్‌లతో పాటు యూఏఈలోని దుబాయ్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. మిగిలిన అన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహిస్తారు.
champions trophy 2025, karachi,
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
బుధవారం జరిగే ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, మాజీ ఛాంపియన్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. 2013 ఛాంపియన్స్ అయిన భారత్ గురువారం బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది.
ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒకసారి ఆడుతుంది. అంటే ప్రతి జట్టుకు 3 మ్యాచ్‌లు ఉంటాయి. గ్రూప్ దశలో టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
Image Credit: Getty Images
ఫైనల్ మ్యాచ్ వేదికను భారత్ డిసైడ్ చేయనుంది !
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారతదేశం తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ స్టేడియంలో ఆడుతుంది. మిగతా జట్ల మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ స్టేడియాలలో జరుగుతాయి. సెమీ-ఫైనల్స్‌కు దుబాయ్, లాహోర్ ఆతిథ్యం ఇస్తాయి.
భారతదేశం సెమీ-ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది, మరో సెమీ-ఫైనల్ లాహోర్‌లో జరుగుతుంది. టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే, మ్యాచ్ లాహోర్ నుండి దుబాయ్‌కు మారుతుంది. భారతదేశం కాకుండా వేరే ఏ జట్టు ఏదైనా ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది.
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఏ జట్లు ఏ గ్రూపులో ఉన్నాయి?
గ్రూప్ 'ఏ'
భారతదేశం, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
గ్రూప్ 'బీ'
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొత్తం ప్రైజ్ మనీ ఎంత?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తం ప్రైజ్ మనీ దాదాపు 6.9 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.60 కోట్లు.
విజేత: 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 కోట్లు)
రన్నరప్: 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.72 కోట్లు)
సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు: ప్రతి జట్టుకు 560,000 డాలర్లు (సుమారు రూ.4.86 కోట్లు)
గ్రూప్ దశలో ప్రతి విజయానికి: 34,000 డాలర్లు (సుమారు రూ.30 లక్షలు)
ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లు: ప్రతి జట్టుకు 350,000 డాలర్లు (సుమారు రూ.3 కోట్లు)
ఏడవ, ఎనిమిదవ స్థానాల్లో నిలిచిన జట్లు: ప్రతి జట్టుకు 140,000 డాలర్లు (సుమారు రూ.1.2 కోట్లు)
టోర్నీలో పాల్గొన్నందుకు: ప్రతి జట్టుకు 125,000 డాలర్లు (సుమారు రూ.1.08 కోట్లు)