- Home
- Sports
- Cricket
- IND vs SL: ఈ మ్యాచులకు కూడా వాళ్లను ఆడించడం అవసరమా..? జట్టు ఎంపికపై నెహ్రా షాకింగ్ కామెంట్స్
IND vs SL: ఈ మ్యాచులకు కూడా వాళ్లను ఆడించడం అవసరమా..? జట్టు ఎంపికపై నెహ్రా షాకింగ్ కామెంట్స్
Ashish Nehra Comments On Jasprit Bumrah: పొట్టి ప్రపంచకప్ నకు మరో ఏడు నెలలే సమయం ఉండటంతో అన్ని ఆప్షన్లను పరిశీలించాలని.. స్టార్ ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తే బెటరని నెహ్రా కామెంట్స్ చేశాడు.

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు గాను తొలి మ్యాచులో భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లంకతో సిరీస్ లో కూడా బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం అవసరమా..? అని కామెంట్స్ చేశాడు.
గురువారం తొలి టీ20 అనంతరం నెహ్రా, ప్రముఖ క్రీడా ఛానెల్ తో స్పందిస్తూ.. ‘లంకతో సిరీస్ లో బుమ్రాను ఆడించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు చాలా మంది ఉన్నారు.
ఆ ఆటగాళ్లందరికీ అవకాశాలను ఇవ్వాలి. బుమ్రా జట్టులోకి రావడం వల్ల మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు బెంచ్ కే పరిమితమవుతున్నారు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నకు కూడా సమయం దగ్గర పడుతున్నది. ఈ క్రమంలో అన్ని ఆప్షన్లను పరిశీలించాలి.. బుమ్రా ను టీ20లతో పాటు టెస్టులకు కూడా ఎంపిక చేశారు. వరల్డ్ కప్ కు ముందు ఆటగాళ్లందరికీ అవకాశాలిచ్చి వారిలో నమ్మకాన్ని కలిగించాలి..’ అని నెహ్రా అన్నాడు.
గురువారం లంకతో జరిగిన మ్యాచులో బుమ్రా.. వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. కెఎల్ రాహుల్ గైర్హాజరీలో అతడు ఉప సారథ్య బాధ్యతలు కూడా మోస్తున్నాడు. ఇక నిన్నటి మ్యాచులో బుమ్రా.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.
లంకతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా పై నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు నెలల తర్వాత అతడు జట్టులోకి రావడం సంతోషం కలిగించిందని చెప్పాడు
అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణించగల సామర్థ్యం జడేజాలో ఉందని, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడని కొనియాడాడు. నిన్నటి మ్యాచులో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందినా చివర్లో వచ్చిన జడ్డూ పెద్దగా మెరుపులు మెరిపించలేదు. కానీ బౌలింగ్ లో మాత్రం అతడు 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి లంక వికెట్ కీపర్ దినేశ్ చండిమాల్ వికెట్ పడగొట్టాడు.