- Home
- Andhra Pradesh
- Cricket: 13 సిక్సర్లు, 10 ఫోర్లతో చిచ్చరపిడుగు విస్పోటనం.. దెబ్బకు డివిలియర్స్ రికార్డుకే ఎసరొచ్చిందిగా
Cricket: 13 సిక్సర్లు, 10 ఫోర్లతో చిచ్చరపిడుగు విస్పోటనం.. దెబ్బకు డివిలియర్స్ రికార్డుకే ఎసరొచ్చిందిగా
Cricket: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ ఏ బ్యాటర్ చేశాడనే ప్రశ్న అడిగితే.? ఠక్కున అందరూ కూడా ఏబీ డివిలియర్స్ అని అంటారు. ఇక ఏబీడీ చేసిన ఈ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది.

ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికే.. క్రికెట్‌లో కూడా అంతే.! ఓ బ్యాటర్ చేసిన రికార్డును మరో బ్యాటర్.. బౌలర్ వేసిన అమేజింగ్ స్పెల్‌ను మరో బౌలర్ సాధించి చరిత్రను తిరగారస్తారు. అలాగే దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ సృష్టించిన వన్డేల్లో అత్యంత వేగవంతమైన రికార్డును ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు రెండు సంవత్సరాల క్రితం బద్దలు కొట్టాడు. అంటే 2023లో ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఏబీడీ కొట్టిన 31 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు.
మార్ష్ కప్‌లో మెక్‌గుర్క్ సెంచరీ
ఆస్ట్రేలియాలో జరిగిన మార్ష్ కప్ టోర్నమెంట్‌లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టాస్మానియా 50 ఓవర్లలో 435 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆస్ట్రేలియాకు ఓపెనర్‌గా దిగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తుఫాను బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు.
13 సిక్సర్లు, 10 ఫోర్లతో 125 పరుగులు
మొదటి ఓవర్ నుంచి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు మెక్‌గుర్క్. కేవలం 29 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో కేవలం 38 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 13 సిక్సర్లు, 10 ఫోర్లతో 125 పరుగులు చేశాడు.
2023లో రికార్డు బద్దలు
ఈ వేగవంతమైన సెంచరీ చేసినప్పటికీ, దక్షిణ ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 398 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2023లో బద్దలైన ఈ విస్ఫోటక ప్రపంచ రికార్డు సెంచరీకి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక ఆటగాడు
ఈ రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెక్‌గుర్క్‌ను రిటైన్ చేసుకుంది.