MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: దక్షిణాఫ్రికా టూర్.. అంతా రోహిత్ చేతిలోనే.. హార్దిక్ పాండ్యా భారత జట్టులోకి వస్తాడా? లేదా?

Hardik Pandya: దక్షిణాఫ్రికా టూర్.. అంతా రోహిత్ చేతిలోనే.. హార్దిక్ పాండ్యా భారత జట్టులోకి వస్తాడా? లేదా?

South Africa tour: రోహిత్ శ‌ర్మ భార‌త టీ20 జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే T20 ప్రపంచ కప్‌కు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ రోహిత్ అంగీకరించకపోతే దక్షిణాఫ్రికాలో జరిగే టీ20లకు సూర్య కెప్టెన్‌గా కొనసాగుతాడు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 30 2023, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Hardik Pandya: అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే వరల్డ్ క‌ప్ 2023 మ్యాచ్ లో ఎడమ చీలమండ గాయం కావ‌డంతో హార్దిక్ పాండ్యా ప్ర‌స్తుతం విశ్రాంతిలో ఉన్నాడు.  అయితే, ఈ  భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరం కానున్నాడ‌ని స‌మాచారం. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన త‌ర్వాత‌ దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 10 ఆదివారం డర్బన్ వేదికగా తొలి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది.
 

36

హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. జనవరి 11 నుంచి 17 వరకు అఫ్గానిస్థాన్ తో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కు అతడు ఫిట్ గా ఉంటాడని భావిస్తున్నారు.

46

దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లో రోహిత్ శర్మను తిరిగి భారత టీ20 జట్టులోకి రావాల‌నీ, అతని కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తున్నట్లు గత నివేదిక పేర్కొంది.
 

56

ఈ ప్రతిపాదనకు రోహిత్ శర్మ అంగీకరిస్తే 2024లో జరగనున్న టీ20 వరల్డ్ క‌ప్ అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
 

66
Suryakumar Yadav

Suryakumar Yadav

హార్దిక్ తిరిగి వస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న ఉందనీ, అయితే టీ20లకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తే టీ20 వరల్డ్ క‌ప్ కు కూడా నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ భావిస్తోంద‌ని స‌మాచారం. ఒకవేళ రోహిత్ ఒప్పుకోకపోతే దక్షిణాఫ్రికాలో జరిగే టీ20లకు సూర్య కెప్టెన్ గా కొనసాగుతాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Recommended image2
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Recommended image3
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved