MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Glenn Maxwell: మ్యాక్స్ వెల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. రోహిత్ శ‌ర్మ‌ రికార్డులకు ఎసరు.. !

Glenn Maxwell: మ్యాక్స్ వెల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. రోహిత్ శ‌ర్మ‌ రికార్డులకు ఎసరు.. !

India Vs Australia T20 Series: గౌహతిలోని బర్సపారా స్టేడియంలో భారత్ తో జరిగిన మ్యాచ్ తో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా చివరి బంతికి ఉత్కంఠభరిత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 29 2023, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Glenn Maxwell equals Rohit Sharma's record: ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023 లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా మెగా టోర్న‌మెంట్ ట్రోఫీ గెల‌వ‌డంతో గ్లెన్ మ్యాక్స్ వెల్ కీల‌క పాత్ర పోషించాడు. ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న భార‌త్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మూడో మ్యాచ్ లో త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో కంగారుల‌కు సూప‌ర్ విక్ట‌రీని అందించాడు.

26

మూడో టీ20 మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డుల‌కు ఎస‌రు పెట్టాడు మ్యాక్స్ వెల్. 
 

36

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్య‌ధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ సమం చేశాడు. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో భారత్తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 47 బంతుల్లోనే అద్భుత‌ సెంచరీతో ఆస్ట్రేలియా చివరి బంతికి ఉత్కంఠభరిత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
 

46

వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌ను ఓడిపోయిన త‌ర్వాత ఒత్తిడిలో ఉన్నకంగారులు ఈ గెలుపుతో సిరీస్ పై ఆశాలు నిలిపి ఉంచుకున్నారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా 2-1కి తగ్గించగలిగింది.
 

56

కానీ, టీ20 ఫార్మాట్ లో చెరో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్ల రికార్డును హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇద్దరు ఆటగాళ్లు పంచుకున్నారు. మ్యాక్సి త‌న ఇన్నింగ్స్ లో 48 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు.
 

66

ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్ వెల్ ఇది 100వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఈ విజయం టీ20 క్రికెట్ లో మ్యాక్సి పోరాటాన్ని ఎత్తిచూపడంతో పాటు ఆటపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అతని సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
రోహిత్ శర్మ
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : పాకిస్థాన్ పనైపోయింది.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
Recommended image2
Dasun Shanaka : దసున్ షనక ఊచకోత.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన లంక కెప్టెన్
Recommended image3
PAK vs SL : పిచ్చెక్కించిన షనక.. వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved