- Home
- Sports
- Cricket
- Drunken Cricketers : తప్పతాగి కూడా సెంచరీలు బాదిన స్టార్ క్రికెటర్లు.. ఎవరో తెలుసా?
Drunken Cricketers : తప్పతాగి కూడా సెంచరీలు బాదిన స్టార్ క్రికెటర్లు.. ఎవరో తెలుసా?
Drunken Cricketers : చాలా మంది స్టార్ క్రికెటర్లపై మాధకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ తప్పతాగి మైదానంలోకి అడుగుపెట్టిన కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదారు.ఇలాంటి తాగుబోతు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

తాగుబోతు క్రికెటర్లు
క్రికెట్‌ను జెంటిల్‌మెన్ గేమ్ అంటారు… కానీ కొంతమంది ఆటగాళ్లు దీనికి మచ్చ తెచ్చారు. చెడు వ్యసనాల బారినపడ్డ కొందరు స్టార్ క్రికెటర్లు సైతం క్రికెట్ కు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారు. మందు లేదా మాధకద్రవ్యాల మత్తులో కొన్నిసార్లు బాగా ఆడినా… ఆ చెడు అలవాట్ల వల్ల తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. ఇలాంటి ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆండ్రూ సైమండ్స్
తాగుబోతు క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానం ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ ఆండ్రూ సైమండ్స్‌ది. ఒకప్పుడు తన జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా ఉన్న ఈ ఆటగాడు తాగు అలవాటు కారణంగా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఒక మ్యాచ్ సమయంలో తాగి ఉండటంతో జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఈ బ్యాటర్ టెస్టుల్లో 2, వన్డేల్లో 6 సెంచరీలు చేశాడు.
ఆండ్రూ ఫ్లింటాఫ్
తాగుబోతు క్రికెటర్ల జాబితాలో రెండో పేరు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ది. అతడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకడు. టెస్టుల్లో 5 సెంచరీలు, 226 వికెట్లు… వన్డేల్లో 3 సెంచరీలు, 169 వికెట్లు పడగొట్టాడు. కానీ తాగుడు వ్యసనం అతనికి పెద్ద సమస్యగా మారింది. ఒక మ్యాచ్‌లో తాగి ఆడినట్లు… ఈ మైకంలోనే సెంచరీ కూడా చేసినట్లు ఫ్లింటాఫ్ అంగీకరించాడు.
హెర్షెల్ గిబ్స్
దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్‌తో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్ట్రేలియాపై మందు తాగిన మత్తులో 175 పరుగుల ఇన్నింగ్స్ ఆడినట్లు అతను తన ఆత్మకథలో వెల్లడించాడు. ఈ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించినా, తాగుడు వ్యసనం అతని కెరీర్‌ను దెబ్బతీసింది.
షేన్ వార్న్
తాగుబోతు క్రికెటర్ల జాబితాలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. డ్యూరెటిక్ తీసుకున్నందుకు 2003 ప్రపంచ కప్ నుంచి అతన్ని నిషేధించారు. స్టెరాయిడ్లను దాచడానికి దీనిని ఉపయోగిస్తారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ వార్న్.
వినోద్ కాంబ్లీ
టీమ్ ఇండియా నుంచి వినోద్ కాంబ్లీ పేరు కూడా తాగుబోతు క్రికెటర్లు జాబితాలో ఉంది. అతను గొప్ప ఆటగాడు… కానీ వ్యసనం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతని కథ మాధకద్రవ్యాల కంటే ఎక్కువగా తాగుడుతో ముడిపడి ఉంది. మందు అలవాటు వల్ల భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఒకప్పుడు కాంబ్లీని భవిష్యత్ స్టార్ అన్నారు… కానీ ఒక తప్పు అంతా నాశనం చేసింది.

