MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Drunk and Drive : ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పట్టుబడరో తెలుసా? పనిష్మెంట్ ఉండదు

Drunk and Drive : ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పట్టుబడరో తెలుసా? పనిష్మెంట్ ఉండదు

Drunk Driving Penalty : డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ అవుతుంది, ఫైన్ పడుతుంది, ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. మరి ఎంత తాగితే డ్రంక్ ఆండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడకుండా ఉంటారో తెలుసా? 

3 Min read
Arun Kumar P
Published : Jul 31 2025, 07:55 PM IST| Updated : Jul 31 2025, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తాగి వాహనం నడుపుతున్నారా?
Image Credit : Getty

తాగి వాహనం నడుపుతున్నారా?

Drunk and Drive : మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమే కాదు చట్టరిత్యా నేరం. డ్రంక్ ఆండ్ డ్రైవ్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోయాయి... చాలామంది మద్యంమత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ డ్రంక్ ఆండ్ డ్రైవ్ ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే తాగిన మైకంలో వాహనాలను నడిపేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు... భారీ జరిమానాలు, వాహనం సీజ్ చేయడంతో పాటు జైలు శిక్షలు కూడా వేస్తున్నారు.

పోలీసుల చర్యలతో డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. కానీ ఇప్పటికీ కొందరు తాగి డ్రైవింగ్ చేస్తూ తనిఖీ చేపట్టిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన సీరియస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఊపిరి బిగబడితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటామనుకుని చేసే వింత చేష్టలు, తాగిన మైకంలో పన్నీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు కంటెంట్ క్రియేటర్స్ కేవలం డ్రంక్ ఇండ్ డ్రైవ్ వీడియోలతోనే ఛానల్ నడిపిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రజలు దీనిగురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని. 

DID YOU
KNOW
?
డ్రంక్ ఆండ్ డ్రైవ్ ఫైన్ ఎంత?
భారతదేశంలో డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా లేదా ఆరునెలల జైలుశిక్ష ఉంటుంది. రెండోసారి కూడా పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా ఏడాది జైలుశిక్ష విధిస్తారు.
25
ఎంత తాగితే తక్కువ పాయింట్లు వస్తాయి?
Image Credit : Getty

ఎంత తాగితే తక్కువ పాయింట్లు వస్తాయి?

అయితే ఈ రచ్చంతా ఎందుకు… అసలు మందు తాగాక డ్రైవింగ్ చేయకపోతే సరిపోతుంది కదా అనుకునేవారు చాలామంది ఉన్నారు. మరోవైపు ఎంత తాగితే పోలీసులకు పట్టుడినా చర్యలుండవు? బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పరిమితి కంటే తక్కువ పాయింట్స్ వస్తాయి? అనేది తెలుసుకుని దాన్ని ఫాలో కావాలనుకునేవారు మరికొందరు. మరి ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

Related Articles

Related image1
Driving license: ఈ త‌ప్పు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు కావ‌డం ఖాయం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Related image2
Drinking beer: వాట్ .. బీర్ తాగితే మంచిదా..?
35
అసలు ఏమిటీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్? ఎలా చేస్తారు?
Image Credit : Gemini AI

అసలు ఏమిటీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్? ఎలా చేస్తారు?

చాలాదేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంది. తాగి వాహనాలను నడిపేవారికి గుర్తించి శిక్షించేందుకు పోలీసులకు మరీముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి అధికారం కల్పించారు. మద్యం సేవించినవారిని గుర్తించి వారు మత్తులో ఉన్నారని నిర్దారించేందుకు అప్పటికప్పుడు ఓ టెస్ట్ ను నిర్వహించే ఏర్పాటు చేశారు... ఇదే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.

కేవలం శ్వాస ద్వారా ఎంత తాగారో చెప్పే పరికరాన్ని పోలీసులకు అందించారు. మద్యం సేవించినవారు గట్టిగా ఊపిరిని వదలడం ద్వారా ఈ పరికరం వారి రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని గుర్తిస్తుంది. ఈ పరికరం కొలతల ఆధారంగా ఎంత తాగారు? మద్యంమత్తు ఏ స్థాయిలో ఉంది? గుర్తిస్తారు. ఎక్కువగా మద్యం సేవించినట్లు తేలితే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు పోలీసులు.

45
ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడరు
Image Credit : stockPhoto

ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడరు

ఇది చాలామంది డౌట్... ఎంత తాగితే బ్రీత్  ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటారు? దీనికి హైదరాబాద్ పోలీస్ అధికారి జివి. రమణగౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత తాగితే బ్రీత్ టెస్ట్ లో తక్కువ పాయింట్లు వస్తాయో తెలిపారు. కానీ శరీరతత్వాన్ని బట్టి కూడా ఈ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని పోలీస్ అధికారి వెల్లడించారు.

సాధారణంగా ఓ వ్యక్తి పెగ్ అంటే 60ML వరకు మద్యం సేవిస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో తక్కువ పాయింట్లు వస్తాయని రమణ గౌడ్ వెల్లడించారు. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదని... యాసిడిక్ బాడీ కలిగినవారికి ఇంత తాగినా ఎక్కువ పాయింట్లు వస్తాయని తెలిపారు. విస్కీ, రమ్ కంటే బీర్ తాగినవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మరింత ఎక్కువ పాయింట్లు వస్తాయని ఏసిపి తెలిపారు.

బ్రీత్ టెస్ట్ లో 30 పాయింట్స్ లోపు వస్తే వదిలేస్తారు... అంతకంటే ఎక్కువ వచ్చిందంటే బైక్ సీజ్ చేస్తారు. 100 దాటిందంటే అది అసాధారణం... అతడు పీకలదాక తాగాడని అర్థం. కొందరికి ఉదయం తాగినా సాయంత్రం బ్రీత్ టెస్ట్ చేస్తే తాగినట్లు చూపిస్తుంది. ఇందుకు కూడా శరీరతత్వం కారణమని రమణ గౌడ్ తెలిపారు. ఇలా డ్రంక్ ఆండ్ డ్రైవ్ గురించి పోలీస్ అధికారి రమణగౌడ్ ఐడ్రీమ్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.

55
మద్యం తాగకున్న బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్ వస్తుందా?
Image Credit : stockPhoto

మద్యం తాగకున్న బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్ వస్తుందా?

మద్యం తాగకుండానే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కేఎస్ ఆర్టీసీ డ్రైవర్లకు ఇటీవల రొటీన్ చెకప్ లో భాగంగా బ్రీత్ టెస్ట్ నిర్వహించారు అధికారులు... కానీ వారు మద్యం తాగకున్నా పాజిటివ్ గా వచ్చింది. 

అయితే వీరు పనస పండు తినడం వల్ల పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్ని పండిన లేదా పులిసిన ఆహార పదార్థాలు తింటే మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తుందని... కర్ణాటక ఆర్టిసి డ్రైవర్ల విషయంలోనూ ఇదే జరిగిందని తేలింది.

గమనిక : మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం. కాబట్టి ఎంత తాగినా వాహనాన్ని నడపకూడదు. కేవలం సమాచారం కోసమే ఈ ఆర్టికల్ అందించాం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved