ఒలింపిక్ సిల్వర్ మెడల్ కు అర్హురాలు.. వినేష్ ఫోగట్ కు మద్దతుగా సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar supports Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024 లో అద్భుత ప్రదర్శనతో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ కు చేరుకున్నారు. అయితే, ఏవరూ ఊహించని విధంగా ఆమె అనర్హతకు గురయ్యారు. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ కు సచిన్ టెండూల్కర్ మద్దతు ప్రకటించారు.
Sachin Tendulkar , Vinesh Phogat
Sachin Tendulkar supports Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ విషయంలో పారిస్ ఒలింపిక్స్, ఒలిపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వినేష్ ఫోగట్ కు మద్దతుగా చాలా మంది క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) బౌండరీలో తుది నిర్ణయం వచ్చి చేరింది. ఈ క్రమంలోనే లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు మద్దతుగా నిలిచారు.
VInesh Phogat
పారిస్ ఒలింపిక్స్‌లో అద్బుత ప్రదర్శనతో వినేష్ ఫోగట్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకున్నారు. అయితే, గోల్డ్ మెడల్ ఫైట్ కు ముందు వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న వినేష్ ఉదయం తూకం వేసే సమయంలో 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు అనర్హతకు గురయ్యారు. దీంతో ఆమె ఒలింపిక్ మెడల్ రేసు నుంచి ఔట్ అయ్యారు. అయితే, ఆమె తనకు సిల్వర్ మెడల్ ను ప్రదానం చేయాలని డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ని ఆశ్రయించింది.
అనర్హత వేటుతో నిరాశకు గురైన వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది క్రీడావర్గాలను కదిలించింది. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ వినేష్ కు మద్దతు ప్రకటించారు. తర్కం, క్రీడా స్పృహను ధిక్కరించి, నిబంధనలను పునఃసమీక్షించాలని కోరారు. వినేష్ సిల్వర్ మెడల్ కు అర్హురాలని పేర్కొన్నారు.
"ప్రతి క్రీడకు నియమాలు ఉంటాయి. ఆ నియమాలను సందర్భానుసారంగా చూడవలసి ఉంటుంది, కొన్నిసార్లు మళ్లీ సందర్శించవచ్చు. వినేష్ ఫోగాట్ ఫైనల్స్‌కు ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా అర్హత సాధించాడు. ఆమె బరువుతో అనర్హత ఫైనల్స్‌కు ముందు జరిగింది. కాబట్టి ఆమె సిల్వర్ మెడల్ కు అర్హత కలిగి ఉంది. ఇది లాజిక్ అండ్ స్పోర్ట్స్ సెన్స్‌ను నొక్కి చెబుతుందని" అని టెండూల్కర్ పేర్కొన్నాడు.
ఆమె అనర్హత వేటు పడిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆమెకు సిల్వర్ మెడల్ అందించాలని టెండూల్కర్ పేర్కొన్నాడు. "పనితీరును మెరుగుపరిచే డ్రగ్స్ వాడకం వంటి అనైతిక ఉల్లంఘనలతో అథ్లెట్ అనర్హుడైతే అది అర్థవంతమైనది. ఇలాంటి సమయంలో ఏ పతకాన్ని ప్రదానం చేయకుండా, చివరి స్థానంలో ఉంచడం సమర్థనీయమైనది. కానీ, వినేష్ ఫోగట్ ప్రారంభం నుంచి అందరినీ ఓడించి ఫైనల్ కు చేరుకున్నారు. ఖచ్చితంగా ఆమె సిల్వర్ మెడల్ కు అర్హురాలు అని సచిన్ పేర్కొన్నారు. సీఏఎస్ వినేష్ ఫోగట్ కు అనుకూలంగా తీర్పునిస్తుందని ఆశిస్తున్నట్టు" సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.